పుష్పాలంకరణ | - | Sakshi
Sakshi News home page

పుష్పాలంకరణ

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకుడు శ్రీనివాసాచార్యులు లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అర్హులందరికీ పథకాలు అందాలి

జగిత్యాలరూరల్‌: జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా మండల మహిళా సమాఖ్యలు కృషి చేయాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్‌ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 141 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 13.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొనుగోళ్లను విజయవంతం చేసిన ఏపీఎం, సీసీలు, కమిటీ సభ్యులు, వీవోఏలను అభినందించారు. జిల్లా అదనపు ప్రాజెక్ట్‌ అధికారి సునీత మాట్లాడుతూ, బ్యాంక్‌ లింకేజీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.793.74 కోట్ల టార్గెట్‌ నిర్దేశించడం జరిగిందని, టార్గెట్‌ ప్రకారం ప్రగతి సాధించేలా మండల సమాఖ్య సిబ్బంది కృషి చేయాలన్నారు. డీపీఎంలు నారాయణ, నాగేశ్వర్‌రావు, సీ్త్రనిధి ఆర్‌ఎం నారాయణ, జిల్లా ఎస్బీఎం కోఆర్డినేటర్‌ హరిణి, ఏపీఎంలు గంగాధర్‌, త్రివేణి, హుస్సేన్‌, చక్రవర్తి, సమాఖ్య అధ్యక్షురాలు సరోజ, కార్యదర్శి ఆమని పాల్గొన్నారు.

ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత

జగిత్యాలరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సారంగాపూర్‌ మండల కేంద్రంలో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందక రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో కేసీఆర్‌ పాలనలో రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఏ రైతును పలుకరించినా 5–10 కిలోలు ధాన్యం తూకంలో నష్టపోయామని వాపోతున్నారని పేర్కొన్నారు. జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలు, ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా అమలు చేస్తారని ప్రజలు ఎంతో ఆశించినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడుస్తున్నా కొత్త పెన్షన్‌ ఎవరికీ రాలేదన్నారు. నాయకులు చంద్ర కృష్ణారెడ్డి, బూసి మల్లేశం పాల్గొన్నారు.

యూపీఎస్‌ పునఃప్రారంభం

గొల్లపల్లి: రెండేళ్లుగా మూతపడిన గొల్లపల్లి మండలం తిరుమలాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల గ్రామస్తులు, ఉపాధ్యాయుల కృషితో పునఃప్రారంభమైంది. పాఠశాల పునఃప్రారంభంపై శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామస్తుల్లో అవగాహన పెరగడంతో, శుక్రవారం ఒక్కరోజే 30 మంది విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందడం విశేషం. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని, అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు గోస్కుల శ్రీనివాస్‌ను ఎంఈవో రాజన్న అభినందించారు. ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, స్వశక్తి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement