సౌకర్యాలు కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

సౌకర్యాలు కల్పిస్తాం

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

జిల్లా కేంద్రంలోని ఏకై క పార్కులో వసతుల లేమి పట్టణవాసులు సేద తీరేందుకు స్థలం కరువు తుప్పుపట్టిన చిన్నారుల ఆట పరికరాలు ఫౌంటేన్లు, పరికరాలకు నామమాత్రంగా మరమ్మతు

జగిత్యాల: జిల్లా కేంద్రం జగిత్యాల గ్రేడ్‌–1 మున్సిపాలిటీ. కానీ, పట్టణవాసులు సేద తీరేందుకు సరైన స్థలాలు లేవు. పట్టణంలో 1,30,863 జనాభాకు అమరవీరుల స్తూపం వద్ద ఎకరం స్థలంలో ఒకటే పార్క్‌ ఏర్పాటు చేశారు. కానీ, అందులో సరైన సౌకర్యాలు లేవు. పట్టణ నడిబొడ్డున గల పార్క్‌లో వసతులు లేక పార్క్‌ కళావిహీనంగా మారింది. ఎప్పుడో ఏర్పాటు చేసిన పరికరాలు, ఫౌంటేన్లు దెబ్బతినగా, సంబంధిత అధికారులు వాటికి నామమాత్రంగా

పైన పూతలు పూసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు ఉద్యానవనంలో ఆధుని క వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ౖపైపెనే పూతలు

పార్కులో పిల్లలు ఆడుకునేందుకు గతంలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అవి శిథిలావస్థకు చేరడంతో బల్దియా రూ.10 లక్షల నిధులు పార్క్‌ కోసం కేటాయించగా, ౖపైపె మరమ్మతులు చేపట్టి మమ అనిపించారు. పార్క్‌లో మ్యూజికల్‌ ఫౌంటేన్‌, మరో సాధారణ ఫౌంటేన్‌, ఆట పరికరాలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరైనా, కొత్తవి మాత్రం ఏర్పాటు చేయలేదు. పిల్లలు ఆడుకునే పరికరాలకు రంగులు పూసి వదిలేశారు.

పట్టణవాసులకు ఆహ్లాదం కరువు

జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో వివిధ పనుల నిమిత్తం రోజూ చాలా మంది వస్తూ పోతుంటారు. కాగా, ప్రజలు సేద తీరేందుకు పట్టణంలో స్థలం కరువైంది. పట్టణవాసులకు సైతం ఆహ్లాదం అందడం లేదు. ఉన్న ఒకే ఒక పార్క్‌లో సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉన్న పార్కులో ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు కొత్త పార్క్‌ ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

పార్కులో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల తాగునీటి వసతి ఏర్పాటు చేశాం. ఫౌంటేన్లకు మరమ్మతు చేయిస్తున్నాం. ప్రజలకు ఆహ్లాదం అందించేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇటీవల బడ్జెట్‌లో రూ.5 లక్షలు కేటాయించాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తాం.– ఆనంద్‌కుమార్‌,

డీఈ, జగిత్యాల

Advertisement
 
Advertisement
Advertisement