ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

వెల్గటూర్‌: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పాశిగామ, స్తంభంపెల్లిలో కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం మాయిశ్చర్‌ వచ్చిన వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణాలో నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిల్లుల వద్ద త్వరగా అన్‌లోడింగ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు ఉన్నందున కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, డీసీవో మనోజ్‌కుమార్‌, డీఎం జితేంద్రప్రసాద్‌, తహసీల్దార్‌ శేఖర్‌, ఎంపీడీవో వెంకట్‌ప్రసాధ్‌, ఎంపీవో కృపాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement