జగిత్యాలక్రైం: ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. పెరుగుతున్న కాలుష్యం, వాతా వరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి స మస్యలకు చెట్ల పెంపకం ప్రధాన పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నా టి సంరక్షించాలని కోరారు. ఏఎస్పీ చేతన్ నితిన్, ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణ, డీఎస్పీలు పురుషో త్తంరెడ్డి, రాములు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలి
నేరాలను త్వరగా ఛేదించాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, బాధితులకు న్యాయం అందించేలా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గంజాయి సరఫరా మార్గాలను గుర్తించి కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. భూవివాదాలు, పాత కక్షలతో నేరాలకు పాల్పడే వారిని గుర్తించి బైండోవర్ చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని సూచించారు.
జీవో 38 అమలు చేయాలి
జగిత్యాల: వైద్యుల బదిలీల్లో జీవో 38 అమలు చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మాతా శిశు సంక్షేమ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందన్నారు. భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో, సమీప ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా స్పౌజ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోశాధికారి నవీన్, వైద్యాధికారులు పాల్గొన్నారు.


