అలిశెట్టి రచనలు అందరికీ స్ఫూర్తి
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల/జగిత్యాలటౌన్: అక్షరసూరీడు అలిశెట్టి ప్రభాకర్ రచనలు అందరికీ స్ఫూర్తిదాయకమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. అలిశెట్టి జయంతి, వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంగడిబజారులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తన కవితలతో సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపారని, సమాజహితం కోసం ఆయన రచనలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. అక్షరాలను ఆయుధాలుగా మలిచి రచనలు చేసిన అలిశెట్టి గొప్ప విప్లవాన్ని సృష్టించారని బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ నివాళి అర్పించారు. భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో ఏసీఎస్.రాజు తదితరులు నివాళి అర్పించారు.
దుబాయ్‌లో సంక్రాంతి సంబరాలు
రాయికల్: యూఏఈలోని పద్మశాలీ కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. 145 మందికిపైగా కుటుంబ సభ్యులు అంతా ఒక్కచోట చేరి మహిళల ముగ్గుల పోటీలతోపాటు, బోగిపళ్ల కార్యక్రమం నిర్వహించారు. పవన్, అశోక్, లక్ష్మీనారాయణ, జగదీశ్, సురేశ్, రాజేశ్, సందీప్, శ్రీనివాస్, నాగేంద్ర, సతీశ్, నరేందర్, శిరీష్, సదానంద్, సుధాకర్ పాల్గొన్నారు.
ఆయిల్ పామ్‌తో ఆదాయం
రాయికల్: ఆయిల్ పాం సాగుద్వారా 30ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యాంప్రసాద్ అన్నారు. మండలంలోని ఇటిక్యాలలో ఆయిల్ పాం మొక్కలు నాటించారు. ఆయిల్ పాం సాగు చేసే రైతులకు 90శాతం సబ్సిడీ లభిస్తుందని, డ్రిప్‌పై 80 నుంచి 100 శాతం సబ్సిడీ అందుతుందని పేర్కొన్నారు. ఎకరాకు రూ.4200 చొప్పున నాలుగేళ్లపాటు నిర్వహణ ఖర్చులు చెల్లించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాల్లో ఆయిల్ పాం తోటలున్నాయని, వీటిద్వారా వడగళ్ల వాన, కోతుల బెడదతో నష్టం ఉండదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యాన అధికారి స్వాతి, ఏవో ముక్తేశ్వర్, ఏఈవో మతయ్య, రాజేశ్, లోహ్య కంపెనీ ప్రతినిధులు విజయ్, భరత్, రాజేశ్, సిగ్నెట్ డ్రిప్ కంపెనీ సిబ్బంది గణేశ్ పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఆత్మకూర్ కళాకారులు
గొల్లపల్లి: ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఈనెల 26న జరిగే గణతంత్ర పరేడ్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు ఎంపికయ్యారు. కళాకారుడు ఒగ్గు రవి నేతృత్వంలోని 30 మంది బృందం ఎంపిక కాగా.. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ కళారూపం ఢిల్లీలో ప్రదర్శితం కావడం తొలిసారి. ఈ ప్రతిష్టాత్మక బృందంలో ఆత్మకూర్‌కు చెందిన ధీకొండ రాజశేఖర్, డి.రాజమల్లు, ఏ.రాజు, డి.రాము, ఏ.అరవింద్ ఉన్నారు. వీరు ఈ నెల 8న ఢిల్లీ వెళ్లి.. 25వరకు రిహార్సల్స్ చేసి, 26న ప్రదర్శన ఇవ్వనున్నారు.
అలిశెట్టి రచనలు అందరికీ స్ఫూర్తి
అలిశెట్టి రచనలు అందరికీ స్ఫూర్తి
అలిశెట్టి రచనలు అందరికీ స్ఫూర్తి


