డూడూ.. బసవన్న
సంక్రాంతి అంటేనే గంగిరెద్దుల విన్యాసాలు
ఊరూరా అంతగా కనిపించని సందడి
ఉమ్మడి జిల్లాలో గంగిరెద్దుల వారికి ప్రత్యేక గ్రామాలు
వృత్తిని వదిలేసి.. ప్రత్యామ్నాయం చూసుకుంటున్న కొందరు
‘డూడూ బసవన్న.. ఇటు రారా బసవన్న.. ఉరుకుతూ రారన్నా.. రారా బసవన్నా.. అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు.. ఈ ఇంటికి మేలు జరుగుతుందని చెప్పు’.. అంటూ గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ బిక్షాటన చేసే గంగిరెద్దుల వారి కుటుంబాల్లో తరాలు మారినకొద్ది వృత్తులూ మారిపోతున్నాయి. సంక్రాంతి అంటేనే గంగిరెద్దులవారి సందడి.. బసవన్నలు చేసే విన్యాసాలు.. అవి ఇంటి ముంగిట అడుగుపెడితే శుభమని ప్రజల నమ్మకం.. బసవన్నల కాళ్లు కడిగి మంచి రోజులు రావాలని మొక్కుకుంటారు. ప్రస్తుతం పండుగ వేళ గ్రామాల్లో వారి సందడి కనిపించినా, సరైన ఆదరణ లేక అనాధిగా వస్తున్న ఆచారానికి దూరమై ఆధునికత వైపు అడుగులేస్తున్నారు. తాతాముత్తాల నుంచి వస్తున్న వృత్తిని వదిలేస్తూ వ్యవసాయం,
ఇతర పనుల వైపు మొగ్గు
చూపుతున్నారు.
– IIలో...


