తొలివిడత ప్రశాంతం
జగిత్యాల: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చలి తీవ్రత అధికంగా ఉన్నా.. వృద్ధులు, మహిళలు, యువత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మల్లాపూర్‌లో 80.07శాతం పోలింగ్ నమోదుకా గా.. అత్యల్పంగా కథలాపూర్‌లో 74.75 శాతంగా నమోదైంది. మిగిలిన మండలాల్లో 77శాతానికి పై గానే నమోదైంది. జిల్లాలోని 122 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 118 పంచాయతీలు, 1,172 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం మొత్తం 1172 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2005 మంది అధికారులను నియమించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
89 మంది ఎన్నికల సిబ్బందికి
షోకాజ్ నోటీసులు
పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధులు కేటాయించిన 81 మంది హాజరుకాకపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మెట్‌పల్లిలో 77.30 శాతం ఓటింగ్
మెట్‌పల్లిరూరల్: మండలంలోని 23 గ్రామాల్లో 77.30 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. బండలింగాపూర్, వేంపేట, వెల్లుల, జగ్గాసాగర్ మేజర్ గ్రామాల్లో ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు. వేంపేటలో 101 ఏళ్ల వృద్ధురాలితో ఓటు వేయించారు. బండలింగాపూర్ పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లత సందర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. వేంపేటలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. జగ్గాసాగర్ పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి సందర్శించారు.
పోలింగ్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్
మల్లాపూర్: మల్లాపూర్‌లోని జెడ్పీ హైస్కూల్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు రమేశ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బి.రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఆర్డీవోలు శ్రీనివాస్, జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీష్ ఉన్నారు.
ప్రశాంతంగా ఎన్నికలు
కథలాపూర్: కథలాపూర్ మండలంలో 18 సర్పంచ్ స్థానాలు, 157 వార్డుస్థానాలకు ఎన్నికలు జరిగా యి. ఇక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకోవడం విశేషం.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం: మండలంలో 17 గ్రామ పంచాయతీలకుగాను మూలరాంపూర్, యామపూర్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 15 గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 62.9 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.
కోరుట్లలో..
కోరుట్లరూరల్: కోరుట్ల మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.79 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు.
77.68 శాతం పోలింగ్
మొత్తం ఓటర్లు 2,18,194 మంది
పోలైన ఓట్లు 1,60,759
మల్లాపూర్‌లో అత్యధికంగా 80.07శాతం
అత్యల్పంగా కథలాపూర్‌లో 74.75 శాతం పోలింగ్
89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు
తొలివిడత ప్రశాంతం
తొలివిడత ప్రశాంతం
తొలివిడత ప్రశాంతం
తొలివిడత ప్రశాంతం
తొలివిడత ప్రశాంతం


