అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ధర్మపురి: కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమఫలాలు అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోల్లవాగు ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తానని అన్నారు. గోదావరి పుష్కరాలు విజయవంతం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీపీ సౌల్ల భీమయ్య, జైనా సహకార సంఘం చైర్మన్ సౌల్ల నరేష్, మొగిలి శేఖర్, గడ్డం సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


