
● హరిత జగిత్యాల లక్ష్యం ● స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత
జగిత్యాల బల్దియా బడ్జెట్ రూ.58.41కోట్లు
జగిత్యాల: జగిత్యాల హరిత లక్ష్యంగా మౌలిక సదుపాయల కల్పన, పట్టణాభివృద్ధే ధ్యేయంగా ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) సంబంధించిన మున్సిపల్ బడ్జెట్‌ను స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత ప్రకటించారు. రూ.58.41 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించారు. ఇందులో గ్రీన్‌బడ్జెట్‌కు రూ.2.81 కోట్లు, పట్టణ పారిశుధ్య నిర్వహణకు రూ.2.37 కోట్లు కేటాయించారు. విలీన గ్రామాలు, వెనుకబడిన తరగతులు, ప్రాముఖ్యం కలిగిన వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. పార్క్‌లు, ఆటస్థలాలు, పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్‌లు, స్ట్రీట్ వెండర్స్, జంతువధశాల, శాసీ్త్రయ పద్ధతిలో డంపింగ్‌యార్డు నిర్వహణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ. 3.56 కోట్లు కేటాయించారు. కొత్తగా విలీనమైన గ్రామాల్లో వసతుల కల్పనకు రూ.1.18 కోట్లు కేటాయించారు. సమావేశంలో కమిషనర్ స్పందన పాల్గొన్నారు.
రాయికల్ మున్సిపల్ బడ్జెట్ రూ.8.58 కోట్లు
రాయికల్: రాయికల్ బల్దియా 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.8.58 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్ తెలిపారు. క్యాపిటల్ గ్రాంట్స్ కింద రూ.5.39 కోట్లు, జనరల్ ఫండ్ రూ.3.14 కోట్లు చార్జ్‌డ్ వ్యయం రూ.3.06 కోట్లకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.

● హరిత జగిత్యాల లక్ష్యం ● స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత