అకాల బీభత్సం
● దెబ్బతిన్న పంటలు ● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు ● లేచిపోయిన రేకుల షెడ్లు
I
ఇబ్రహీంపట్నం: కొజన్‌కొత్తుర్‌లో రోడ్డుపై విరిగిపడిన చెట్టు
జగిత్యాల/ఇబ్రహీంపట్నం/కోరుట్లరూరల్/మేడిపల్లి/కథలాపూర్/మెట్‌పల్లిరూరల్: జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు, రాళ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
● ఇబ్రహీంపట్నం మండలంలో రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపుపంటలు తడిసి ముద్దయ్యాయి. వరి, సజ్జ, నువ్వుల పంటలు నేలవాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపోయాయి. ఎర్దండి ఒడ్డెర కాలనీలో తొమ్మిది ఇళ్ల రేకులు లేచిపోయి నిత్యవసర వస్తువులు తడిశాయి.
● కోరుట్ల మండలం నాగులపేట, సంగెం, యెఖీన్‌పూర్, యూసుఫ్‌నగర్, కల్లూర్ తదితర గ్రామాల్లో నువ్వుపంట పూర్తిగా నేల వాలింది. పొలల్లో వడ్లు రాలాయి.
● కథలాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్ కవర్లు కొట్టుకుపోయాచి. భూషణరావుపేట శివారులో విద్యుత్ వైర్లపై తాటిచెట్టు పడటంతో స్తంభం నేలవాలింది. ఆయా గ్రామాల్లో రేకుల షెడ్లు కూలాయి.
● మెట్‌పల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి, నువ్వులు, సజ్జ పంటలు నేలవాలాయి .కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మామిడి కాయలు నేలవాలగా నష్టం వాటిల్లింది. వేంపేటలో నాలుగు, ఆత్మకూర్‌లో ఒక విద్యుత్ స్తంభం విరిగిపోయాయి.
అకాల బీభత్సం
అకాల బీభత్సం


