కొనుగోలు కేంద్రం ప్రారంభం
కథలాపూర్: రైతు సంక్షేమమే ధ్యేయమని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలకేంద్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించా రు. మహిళా సంఘాలకు 50 శాతం కేంద్రాలు కే టాయించామన్నారు. సన్న బియ్యం పంపిణీపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సీలు కట్టి తామే సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం దారుణ మన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదో సమాధానం చె ప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూ ండ్ర నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు కాయితి నాగరాజు, డైరెక్టర్లు రమేశ్‌నాయక్, వాకిటి రాజారెడ్డి, విజయ్, ఏపీఎం న రహరి, సీసీలు అంజయ్య, విజయనిర్మల పాల్గొన్నారు.


