వీణవంక(హుజూరాబాద్): విత్తనోత్పత్తి రైతులకు కష్టకాలమొచ్చింది. ఈ నెల 21నుంచి నాలుగు రో జుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో సీడ్ రైతుల్లో కలవరం మొ దలైంది. ఈ సమయంలో వర్షం పడితే మగ రేణువులు విప్పుకోక ఆడ,మగ వరి మధ్య ఫలదీకరణ జరుగదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం ప డుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే చలి కారణంగా ఆడ,మగ పైరు ఎదుగుదలలో వ్యత్యాసం ఏర్పడింది. పంటను కాపాడుకోవడానికి రసాయనాలు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. జిల్లాలో ఈ యాసంగి 1.10లక్షల ఎకరాలలో హైబ్రిడ్ వరి సాగుచేస్తున్నారు. తెలంగాణలోనే కరీంనగర్ జిల్లా హైబ్రిడ్‌సాగులో మొదటిస్థానంలో ఉంది. ఇక్కడి నేలలు సీడ్‌కు అనుకూలం కావడంతో విత్తన కంపెనీలు పోటీ పడుతున్నాయి.
ఆ గంట సమయమే కీలకం
ఆడ,మగ వరిసాగు కొంత కష్టమే. రెండు పైర్లమధ్య రెండు మీటర్ల ఎడం ఉంటుంది. పైరు పిలకదశలో ఉన్నప్పుడు మగవరి పుప్పొడి రేణువులు ఆడవరిపై పడేలా తాడు లేదా కర్రలతో దులుపాలి. దీంతో ఆడవరి ఫలదీకరణ చెందుతుంది. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల సమయంలో మాత్రమే ఈ పని చేయాలి. మగవరిలో రేణువులు ఈ సమయంలోనే బయటికి వస్తాయి. ఈ ఫలదీకరణ సమయం 12రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు కురిస్తే గింజ తాలుగా మారి రంగు మారుతుంది. ఫలితంగా విత్తనం మొలకెత్తే స్వభావాన్ని కోల్పోతాయి.
క్వింటాల్‌కు రూ.6వేల నుంచి
రూ.20వేల వరకు
హైబ్రిడ్‌సాగులో వీణవంక, శంకరపట్నం, జమ్మికుంటతో పాటు పెద్దపల్లి జిల్లా ముత్తారం, కాల్వశ్రీరాంపూర్, మంథని మండలాల్లో ఎక్కువ. జిల్లాలో ఆరు మల్టీనేషనల్ కంపెనీలతో పాటు 20కి పైగా వివిధ రాష్ట్రాల కంపెనీలు విత్తనం ఇచ్చాయి. ఇక్కడ పండిన పంట ఎనిమిదేళ్లయినా మొలకెత్తే స్వభావం ఉండటంతో కంపెనీలు పోటీపడి విత్తనం ఇస్తున్నాయి. క్వింటాల్‌కు గతేడాది విత్తనధర రూ.6వేల నుంచి 10వేల వరకు ఉండేది. ఈ సారి క్వింటాల్‌కు అదనంగా రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెంచాయి. దీంతో పాటు దిగుబడి వచ్చినా, రాకున్నా.. ఎకరాకు రూ.లక్ష ఇస్తామని కంపెనీ డీలర్లు ప్రకటించడంతో రైతులు పోటీపడి సాగుచేశారు.
నాలుగు రోజుల పాటు వర్షసూచన
భయం.. భయంగా సీడ్ రైతులు
ఇప్పుడు వానలు కురిస్తే ఫలదీకరణపై తీవ్ర ప్రభావం
ఇప్పటికే ఆడ, మగ వరి ఎదుగుదలలో వ్యత్యాసం
పంట దిగుబడి తగ్గుతుందని ఆందోళన
జిల్లాలో 1.10 లక్షల ఎకరాలలో హైబ్రిడ్ వరిసాగు
విత్తనోత్పత్తికి వానగండం