
పంచాంగ శ్రవణం గావిస్తున్న అర్చకులు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై బుధవారం సాయంత్రం శ్రీ శుభకృత్ నామ ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం గావించారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కర్త బుగ్గారపు రాజేంద్రప్రసాద్ శుభ ఫలాలు, తిథులు, నక్షత్రాలు, రాశుల గురించి వివరించారు. అనంతరం పలువురు కళాకారులను సన్మానించారు. సన్మానం పొందిన వారిలో ధర్మపురికి చెందిన వేదపండితుడు దిలీప్‌శర్మ(వేదం), గొల్లపెల్లి గణేశ్(సాహిత్యం), గుండి ప్రేమ్‌కుమార్(మిమిక్రీ), గుండి జగదీశ్(గాయకుడు), బుగ్గారపు రాజేంద్రప్రసాద్(పంచాంగ శ్రవణకర్త) ఉన్నారు. ఈకార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ చైర్మన్ రామన్న, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేదపండితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.