జర చూసి తినండి: పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు

Woman Complaints On Iron Nuts And Bolts In Pizza - Sakshi

మారిన జీవనశైలితో ప్రజలు వండడం తగ్గించేసి ఆన్‌లైన్‌ ఫుడ్‌ యాప్‌లపై పడ్డారు. ఇట్ల ఆర్డర్‌ చేస్తే అలా ఇంటి గడప ముందుకు వస్తుండడంతో ప్రజలు బద్ధకస్తులై వంట గది వైపు చూడడం లేదు. ఇలా ఆన్‌లైన్‌లో వచ్చే ఆహారాన్ని కొంచెం చూసి తినాలి. ఫుడ్‌ యాప్‌లు అందిస్తున్న ఆహారంలో గతంలో ఎన్నోసార్లు ఆహారం సక్రమంగా లేకపోవడం.. పాడవడం.. లేదా ఇతర పదార్థాలు రావడం జరిగాయి. తాజాగా ఓ మహిళకు పిజ్జా ఆర్డర్‌ చేయగా పిజ్జాలో ఇనుప నట్లు.. బోల్టులు వచ్చాయి. అది చూసి నోరెళ్లబెట్టిన ఆమె వెంటనే ఫిర్యాదు చేయడంతో న్యాయం జరిగింది. ఈ సందర్భంగా ఆమె కొంచెం చూసి తినాలని సూచిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: ‘అమ్మాయిలూ ‘జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’)

యూకే (ఇంగ్లాండ్‌)లోని లాంకషేర్‌ రాష్ట్రం థార్టన్‌ క్లెవెలెస్‌ జంట నగరాలకు చెందిన ఓ మహిళ గతనెల 29వ తేదీన డోమినోస్‌లో పిజ్జా ఆర్డర్‌ చేసింది. ఇంటికి చేరిన పిజ్జాను తీసుకుని తింటుండగ ఇనుప నట్లు, బోట్లు కనిపించాయి. ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురయ్యింది. వాటిని ఫొటో తీసి పెట్టుకుని డోమినోస్‌కు ఫిర్యాదు చేసింది. నట్లు, బోట్లు రావడంపై సంస్థ క్షమాపణ చెప్పింది. తన డబ్బులు చెల్లించమని అడగడంతో సంస్థ తిరిగి ఇచ్చేసింది. అయితే అంతకుముందే ఆమె ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్లలో షేర్‌ చేసింది. (చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్‌ వీడియో)

మహిళ: ‘తినడానికి ముందు మీ పిజ్జాలను ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా థోర్టన్‌ క్లెవ్‌లీస్‌లోని డొమినోస్‌ నుంచి పిజ్జా ఆర్డర్‌ పెట్టేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె సూచించింది.
డొమినోస్‌: ‘అసౌకర్యానికి క్షమాపణలు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు స్టోర్‌తో మాట్లాడాం. డొమినోస్‌ వినియోగదారుడి సంతృప్తి, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఇకపై ఇవి కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top