ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి ఆరో రోజులైంది. అసలు ఒక దేశానికి మరో దేశానికి మధ్య ఎంత శత్రుత్వం ఉన్న మాటల పరంగానో, ఆంక్షలు పరంగానో ఉండేవి గానీ యుద్ధం వరకు వెళ్లేది కాదు. కానీ తాజాగా ఉక్రెయిన్ రష్యా ఉదాంతాం మాత్రం అలా కాకుండా నేరుగా రణరంగంలో ఢీకోడుతున్నాయి. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణం నాటోలో ఉక్రెయిన్ చేరాలనుకోవడమే. అసలు నాటో అంటే ఏమిటి. అందులో ఉక్రెయిన్ చేరితో రష్యాకు ఎందుకు నచ్చట్లేదు.. తెలుసుకుందాం!

నాటో అంటే..
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) అనేది ఉత్తర అట్లాంటిక్ కూటమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా 12 దేశాల సైనిక కూటమి. ఈ సంస్థ 4 ఏప్రిల్ 1949న సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని అమలు చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి తమని తాము రక్షించుకనేందుకు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్, కెనడా నాటోని స్థాపించాయి. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది. ఇందులోని ఒప్పందం ప్రకారం.. నాటోలో సభ్య దేశాలుగా ఉన్న ఏ ఒక్క దేశంపైన ఏ కారణం చేతనైనా బయట దేశాలు సాయుధ దాడి జరిపినట్లయితే.. ఆ దేశానికి నాటోలోని మిగిలిన సభ్య దేశాలన్నీ సహాయం చేయాలి. మరో లక్ష్యం ఏమంటే.. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకునేందకని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం రష్యా కూడా నాటోలో ఉక్రెయిన్ చేరాలంటే వ్యతిరేకిస్తోంది కూడా అందుకే!

ప్రపంచంలోనే పవర్‌పుల్ కూటమి..
ప్రస్తుతం నాటోలో 30 దేశాలు ఉన్నాయి. వారు అధికారికంగా నాటో సభ్యులు. నాటోలో 27 యూరోపియన్ దేశాలు, యురేషియాలో ఒక దేశం, ఉత్తర అమెరికాలో 2 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నాటో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమిగా పిలుస్తారు. ఎందుకుంటే శక్తివంతమైన యూరోపియన్ దేశాలు, సంపన్న దేశాలు నాటో సభ్య దేశాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా పిలువబడే అమెరికా కూడా దానిలో భాగం. నాటో కూటమి సైనిక బలగం, వారి వద్ద ఉండే అత్యాధునికి ఆయుధాలు ఇలా ఒక్కటేంటి.. నాటో కూటమిలోని దేశాలలో ఏ ఒక్క దేశంతో యుద్ధం చేస్తే వార్ వన్‌సైడ్ అని క్లారిటీగా చెప్పవచ్చు.

నాటో అంటే గిట్టని రష్యా..
రష్యా మినహా పూర్తి యూరోపియన్ దేశాలు దానిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటమిలో భాగం కాని ఏకైక దేశం ఇది. దీనికి రష్యా , నాటో అంతర్గత కారణాలే అని చెప్పచ్చు. తాజాగా ఉక్రెయిన్ రష్యా సరిహద్దు దేశం కావడం , అది నాటో చేరాలని ప్రయత్నించడంతో రష్యాకు దిగులు పట్టుకుంది. ఎందుకంటే ఉక్రెయిన్ నాటోలో చేరితో పశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని రష్యాను ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పుతిన్ భావించాడు. అందుకు ఉక్రెయిన్ విషయంలో పరిస్ధితులు యద్ధానికి దారితీశాయి.
| సభ్య దేశాలు | చేరిన సంవత్సరం |
| యునైటెడ్ స్టేట్స్ | 1949 |
| యునైటెడ్ కింగ్‌డమ్ | 1949 |
| పోర్చుగల్ | 1949 |
| నార్వే | 1949 |
| ఐస్లాండ్ | 1949 |
| నెదర్లాండ్స్ | 1949 |
| లక్సెంబర్గ్ | 1949 |
| ఇటలీ | 1949 |
| ఫ్రాన్స్ | 1949 |
| డెన్మార్క్ | 1949 |
| కెనడా | 1949 |
| బెల్జియం | 1949 |
| టర్కీ | 1952 |
| గ్రీస్ | 1952 |
| జర్మనీ | 1982 |
| స్పెయిన్ | 1955 |
| పోలాండ్ | 1999 |
| హంగేరి | 1999 |
| చెక్ రిపబ్లిక్ | 1999 |
| స్లోవేకియా | 2004 |
| స్లోవేనియా | 2004 |
| రొమేనియా | 2004 |
| లిథువేనియా | 2004 |
| లాట్వియా | 2004 |
| ఎస్టోనియా | 2004 |
| బల్గేరియా | 2004 |
| క్రొయేషియా | 2009 |
| అల్బేనియా | 2009 |
| ఉత్తర మాసిడోనియా | 2020 |
| మోంటెనెగ్రో | 2017 |


