అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్‌ కెమెరా.. దానికి ముందు

Watch Exact Moment When Drone Crashes Into Erupting Volcano In Iceland - Sakshi

రేక్‌జావిక్: డ్రోన్ కెమెరాల వాడకం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డ్రోన్‌ గాలిలో చక్కర్లు కొడుతూ.. ప్రతీ ఒక్కదానిని కవర్‌ చేసే యాంగిల్స్‌ భలే గమ్మత్తుగా ఉంటుంది. అందుకే సినిమాలు, డాక్యుమెంటరీలు మొదలుకొని చివరికి పెళ్లిలో కూడా డ్రోన్‌ కెమెరాలను వాడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి భగభగమండే అగ్నిపర్వతాన్ని డ్రోన్‌ కెమెరా ఆధారంగా వీడియో తీయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా తన పనిని ప్రారంభించాడు. అప్పుడే బద్దలైన అగ్నిపర్వతంలో ఎగజిమ్ముతున్న లావాను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.అయితే దురదృష్టవశాత్తూ ఆ డ్రోన్‌ అగ్నిపర్వతంలో పడి కరిగిపోయింది. అయితే అతను తీసిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


జోయి హెల్మ్స్ అనే య్యూట్యూబర్.. ఐస్‌ల్యాండ్‌లోని జెల్డింగదాలిర్ లోయలో కొత్తగా కనుగొన్న అగ్నిపర్వతాన్ని చిత్రీకరించేందుకు వెళ్లాడు. అయితే ఆ ప్రాంతమంతా లావాతో నిండిపోవడంతో అగ్నిపర్వం బిలం వరకు వెళ్లడం కష్టమని భావించాడు. దీంతో అతడి డ్రోన్‌కు పనిచెప్పాడు. అగ్నిపర్వతం నుంచి విరజిమ్ముతున్న లావా కాలువ మీదుగా.. ఆ డ్రోన్ కదిలింది. చివరికి బిలం వద్దకు చేరుకుంది. ఇక్కడే అతను తప్పు చేశాడు. డ్రోన్‌ను ఇంకా ఎత్తులోకి తీసుకెళ్లకుండా లావాకు మరింత దగ్గరగా తీసుకెళ్లాడు. దీంతో లావా నుంచి వచ్చే వేడికి డ్రోన్ కరిగిపోయింది. ఆ వెంటనే సిగ్నల్ కూడా పోయింది. అగ్నిపర్వతంలో పడిపోతున్న డ్రోన్‌‌.. చివరి క్షణంలో చిత్రీకరించిన వీడియోను చూసేందుకు మాత్రం నెటిజన్లు ఆసక్తి చూపారు. ఫలితంగా ఈ వీడియోకు సుమారు 4.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్‌ వద్దకు ఎవరు రావొద్దు

ఈ పిల్ల తెలివి మామూలుగా లేదు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top