Viral Video: Bride Chops Off Hair On Wedding Day, Know The Reason Inside - Sakshi
Sakshi News home page

Viral Video: పెళ్లి మండపంలో వధువు అనూహ్య నిర్ణయం.. కుటుంబం కంటతడి..

Jan 6 2023 4:27 PM | Updated on Jan 6 2023 6:22 PM

Viral Video: Bride Chops Off Hair On Wedding Day Know The Reason - Sakshi

పెళ్లి అంటే ఓ పండగ. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకునే వేడుక. రెండు జీవితాలను ఒక్కటి చేసే వేదిక. చాలా మంది తమ పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పలు జంటలు తమ వివాహాన్ని మంచి పనులకు వేదికగా మలుచుకుంటున్నారు. సమాజం కోసం, భవిష్యత్తు కోసం  ఉపయోగపడే పనులకు శ్రీకారం చుడుతున్నారు.

తాజాగా ఓ వధువు కూడా ఇలాగే ఆలోచించింది. పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండేలా అందమైన, పొడవాటి తన జుట్టును కత్తిరించేందుకు సిద్ధపడింది. వధువు అనూహ్య నిర్ణయంతో మండపంలోని అతిథులందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. అనంతరం ఆమె క్యాన్సర్‌ బాధితులకు జుట్టు డొనెట్‌ చేసిందుకు ఇలా చేసిందని తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిలో వధువు తన జుట్టు కత్తిరించుకుంటున్న ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

దీనిని ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్‌ చేశారు. విందులో పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు.. వివాహ వేడుక అనంతరం తన పొడవాటి జుట్టును కత్తిరించుకోవడం కనిపిస్తోంది.  క్యాన్సర్‌ రోగులకు సాయం చేసేందుకు ఇలా చేస్తున్నట్లు ఆమె తెలిపింది. వధువు జుట్టు కత్తిరించుకుంటుంటే ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులతో సహా అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. లక్షల్లో వ్యూస్‌ వచ్చి చేరుతున్నాయి. వధువు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సైతం  ప్రశంసిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement