ఓడ ప్రయాణం.. అంతా చూస్తుండగా భార్యని సముద్రంలోకి విసిరేసిన భర్త!

Viral: Horror Footage Shows Husband Throws His Wife On A Ferry Indonesia - Sakshi

సముద్రంలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి తన భార్యని ఫెర్రీలో నుంచి తోసేసిన ఘటన ఇండోనేషియాలో జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇండోనేషియా పోలీసులు విడుదల చేశారు.  సుండా స్ట్రెయిట్ గుండా ప్రయాణించే ఫెర్రీ ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పోలీసులు షేర్‌ చేసిన వీడియోలో... ఫెర్రిలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమె భర్త తన వెనుక వచ్చి నిల్చుంటాడు. అతనికి ఏమైందోగానీ హఠాత్తుగా ఆమెను ఎత్తుకొని అందరి కళ్లు ముందు ఓవర్‌బోర్డ్‌లో నుంచి సముద్రంలోకి విసిరేస్తాడు. అయితే అదృష్టవశాత్తు, ఆ మహిళ సముద్రంలో పడకుండా తప్పించుకుంటుంది. 

కింద పడ్డ ఆమె ఫెర్రిలోని రెయిలింగ్‌పై ఉన్న కడ్డీలకు అతుక్కుపోవడంతో ప్రాణాలతో బయటపడింది. తోటి ప్రయాణికుల సహాయంతో ఆమె భర్తని పోలీసులకు అప్పగిస్తారు. మరో వైపు.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అతనిపై కేసు నమోదు చేయనట్లు సమాచారం. ఎందుకంటే.. ఆ వ్యక్తి మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేదని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు మహిళ కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్‌: మరో ప్లాంట్‌ షట్‌డౌన్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top