America Celebrates Independence Day: అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు

US Parade Shooting: 22 Year Old Robert E Crimo Suspect Arrested  - Sakshi

High-Powered Rifle Is US Shooting Suspect: అగ్రరాజ్యం అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒక దుండగుడు షికాగో నగర శివారులోని హైల్యాండ్‌ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్‌ డే పరేడ్‌పై కాల్పులకు జరిపాడు.  ఈ నేపథ్యంలోనే అనుమానితుడు 22 ఏళ్ల రాబర్ట్‌ క్రిమోగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

అతను హైపవర్‌ రైఫిల్‌తో వేడుకలకు వచ్చిన ప్రేక్షక్షులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురుమృతి చెందారని వెల్లడించారు. అంతేకాదు ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, కొందరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

నిందితుడు క్రిమో వద్ద ఆయుధాల ఉన్నాయని, అతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెబుతున్నారు. అమెరికన్లకు బహిరంగంగా తుపాకీని తీసుకెళ్లే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటనలు అధికమవ్వడం బాధాకరం. అదీకూడా అమెరికా స్వాతం‍త్య్ర దినోత్సవం రోజున జరగడమే అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది.

అమెరికన్లే తమ దేశ వేడుకలను భగ్నపరిచి విధ్వంసానికి పాల్పడటం అత్యంత హేయం అంటూ... ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఘటన పట్ల కలత చెందానన్నారు. బైడెన్‌ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాదు తాను తుపాకీ హింసకు వ్యతిరేకంగా పోరాడతానని వెనక్కి తగ్గేదేలేదని బైడెన్‌ నొక్కి చెప్పారు.

(చదవండి: America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top