రంగంలోకి యూఎస్‌ సూపర్‌సోనిక్‌ బాంబర్లు

US flies supersonic bomber in show of force against North Korea - Sakshi

సియోల్‌: వరుస క్షిపణి పరీక్షలతో ఉద్రిక్తతలు పెంచుతున్న ఉత్తరకొరియాకు అమెరికా హెచ్చరికలు పంపింది. దక్షిణకొరియాలో జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాల చివరి రోజు శనివారం అధునాతన సూపర్‌సోనిక్‌ బాంబర్‌ బీ–1బీ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 2017 డిసెంబర్‌ తర్వాత వీటిని విమానాలను కొరియా ద్వీపకల్ప విన్యాసాల్లో వాడటం ఇదే తొలిసారి. వారం వ్యవధిలో ఉత్తర కొరియా పరీక్షల పేరిట ఏకంగా 30కి పైగా క్షిపణులు ప్రయోగించడంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

అందుకే ఈసారి విన్యాసాల్లో ఎఫ్‌–35 అగ్రశ్రేణి యుద్ధవిమానంసహా దాదాపు 240 యుద్ధ విమానాలతో తమ సత్తా ఏమిటో ఉ.కొరియాకు చూపే ప్రయత్నంచేశాయి. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అగ్రదేశాల మధ్య బేధాభిప్రాయలు పొడచూపడంతో ఇదే అదనుగా భావించి ఉ.కొరియా క్షిపణి పరీక్షలను ఒక్కసారిగా పెంచేసింది. శనివారం సైతం నాలుగు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. విన్యాసాల పేరిట తమ భూభాగాల దురాక్రమణకు ప్రయత్నిస్తే శక్తివంతమైన సమాధానం ఇస్తామని అమెరికా, ద.కొరియాలనుద్దేశిస్తూ ఉ.కొరియా హెచ్చరించడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top