Ukraine Russia War: Joe Biden calls Vladimir Putin As 'War Criminal' - Sakshi
Sakshi News home page

Ukraine Russia Conflct: ఎవరినీ లెక్కచేయని పుతిన్‌.. బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం

Mar 18 2022 10:44 AM | Updated on Mar 18 2022 11:21 AM

Ukraine Russia War: Joe Biden Described Vladimir Putin As War Criminal - Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా దుశ్చర్యలను యుద్ధ నేరాలుగా బైడెన్‌ ఇంతకుముందే అభివర్ణించిన సంగతి తెలిసిందే. బైడెన్‌ తాజా వ్యాఖ్యలపై రష్యా అభ్యంతరం తెలిపింది. ఆయన క్షమించరాని...

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ పదేపదే కోరుతున్నా లెక్కచేయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్‌ ముమ్మాటికీ యుద్ధనేరస్తుడేనని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా దుశ్చర్యలను యుద్ధ నేరాలుగా బైడెన్‌ ఇంతకుముందే అభివర్ణించిన సంగతి తెలిసిందే. బైడెన్‌ తాజా వ్యాఖ్యలపై రష్యా అభ్యంతరం తెలిపింది. ఆయన క్షమించరాని వాక్చాతుర్యం ప్రదర్శించారని విమర్శించింది.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో బాంబుల వర్షం కురిపించి, వేలాది మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఒక దేశాధినేత అలా అనుచితంగా మాట్లాడడాన్ని అంగీకరించబోమని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ ఇంటర్నేషనల్‌ కోర్టు ఆఫ్‌ జస్టిస్‌ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోబోమన్నారు. తమ అధ్యక్షుడి వ్యాఖ్యలపై అమెరికా వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ వివరణ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల దృశ్యాలను, దయనీయ పరిస్థితులను చూసి బైడెన్‌ చలించిపోయారని, అందుకే పుతిన్‌ను యుద్ధనేరగాడిగా సంబోధించారని చెప్పారు.
(చదవండి: రష్యా రాకెట్‌ దాడిలో ఉక్రెయిన్‌ నటి మృతి)

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement