రష్యాపై ఆంక్షలు.. అమెరికాకు గట్టి షాక్‌!.. తప్పుబట్టిన అమెరికన్‌ దేశం

Ukraine Crisis: Mexico Says Wont Impose Any Sanctions On Russia - Sakshi

ఉక్రెయిన్‌ పరిణామాల్లో ఆర్థిక, ఇతర ఆంక్షలతో రష్యాను ఇరుకున పెడుతున్నామని అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ సంబుర పడుతున్నాయి. ఈ తరుణంలో అగ్రరాజ్యానికి ఊహించని షాక్‌ తగిలింది. ఊహించని మద్దతు రష్యాకు లభించింది. 

ఉత్తర అమెరికా దేశం మెక్సికో.. రష్యాపై ఆర్థిక ఆంక్షలను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు ఉక్రెయిన్‌పై దాడులకుగానూ రష్యాపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించబోదని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్, మంగళవారం ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. 

‘‘ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలతో మేం(మెక్సికో) మంచి సంబంధాలను కొనసాగించాలని అనుకుంటోంది.  ఈ సంక్షోభానికి సంబంధించి అందరితో చర్చించే స్థితిలో మేం ఉన్నాం’’ అని లోపెజ్‌ తెలిపారు.  అంతేకాదు రష్యా మీడియా ఉక్రెయిన్‌ దాడుల విషయంలో అసత్య కథనాలు ప్రసారం చేస్తోందన్న ఆరోపణలను సైతం మెక్సికో అధ్యక్షుడు తోసిపుచ్చారు. 

ఆ వాదనతో నేను అంగీకరించను. రష్యానే కాదు.. ఏ దేశం అలా చేయదు. మీడియా స్వేచ్ఛను గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అని లోబెజ్‌ బబ్రాడోర్‌ స్పష్టం చేశారు. అంతేకాదు అమెరికా, యూరోపియన్‌ దేశాలు తీసుకుంటున్న పలు నిర్ణయాలపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. తద్వారా మెక్సికో వాణిజ్యానికి తీవ్ర అవాంతరం ఎదురవుతోందని ఆయన అంటున్నారు. ఇక ఉక్రెయిన్‌లో బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మెక్సికో..  రాజకీయ పరిష్కారానికి పిలుపునిస్తోంది.

ఇదిలా ఉండగా..  మెక్సికోలో రష్యా పెట్టుబడి దాదాపు 132 మిలియన్‌ డాలర్లుగా ఒక అంచనా. ఇక ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2.4 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువే అని అంచనా.

చదవండి: జనాల్ని చంపేస్తున్నాం.. భయంగా ఉందమ్మా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top