అది ట్రంప్‌ జలసంధి | Trump Strait of Hormuz renaming plan has sparked global debate | Sakshi
Sakshi News home page

అది ట్రంప్‌ జలసంధి

Mar 30 2026 5:33 AM | Updated on Mar 30 2026 5:33 AM

Trump Strait of Hormuz renaming plan has sparked global debate

హార్మూజ్‌పై అమెరికా అధ్యక్షుని జోక్‌

వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్‌ జలసంధి పేరు, ట్రంప్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు చర్చనీయాంశాలయ్యాయి. దీంతో ఆ జలసంధికి తన పేరు పెట్టుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జోక్‌చేశారు. ఆదివారం ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీ నగరంలో జరిగిన ఒక పెట్టుబడుల సదస్సులో ట్రంప్‌ ప్రసంగిస్తూ హార్మూజ్‌ జలసంధి అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇరాన్‌ వెంటనే ట్రంప్‌ జలసంధిని, అంటే హార్మూజ్‌ను తెరవాలి.

దాన్ని పొరపాటున ట్రంప్‌ జలసంధి అన్నానని మీడియాలో తప్పుడు కథనాలు వెలువడతాయేమో. అదేమీ లేదు. నేను పొరపాటు చేస్తే అది పెద్ద వార్తే అవుతుంది’’అని అనగానే మీడియా ప్రతినిధులు ఘొల్లున నవ్వారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ ఘాటుగా స్పందించింది. ‘‘అవును. అధ్యక్షుడు చెబుతున్న ఆ ‘ట్రంప్‌ జలసంధి’ సరిగ్గా ఎప్‌స్టీన్‌ దీవులకు పక్కనే ఉంది’’ అంటూ ఎద్దేవా చేసింది. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం టేపుల్లో ట్రంప్‌ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుండటం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement