దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!

Town In South Africa Houses Only White People - Sakshi

పలానా దేశం అనగానే వాళ్లు ఇలా ఉంటారనే ఒక భావన ఒకటి ఉంటుంది. దక్షిణాఫ్రికా అనగానే నల్లజాతీయలు అని తెలుస్తుంది అందరికీ. అక్కడ ఘోరమైన ఎండలు కారణంగా అక్కడ జీవించే మనుషులు అలా ఉంటారు. అలాంటి చోట ఒరానియా అనే ఒక విచిత్రమైన పట్టణం ఉంది. అక్కడ మొత్తం శ్వేత జాతీయులే ఉంటారు. పైగా ఆ పట్టణం దక్షిణఫ్రికాతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది.

పైగా అక్కడ రోడ్లు ఊడ్చే వ్యక్తి దగ్గర నుంచి కార్మికులు, సెక్యురిటీ గార్డు వరకు అంతా తెల్లవాళ్లే. ఆ ప్రాంతంలోని ఇళ్లు కూడా తెల్లగా ఉండే వాళ్లకు మాత్రమే ఇవ్వబడును అని ఉంటుంది . ఈ పట్టణం పై పలు వివాదాలు కూడా ఉన్నాయి. కేవలం జాత్యాహంకారానికి తెర లేపుతుంది, వర్ణ వివక్షతకు ఆజ్యం పోస్తుందంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఒరానియా పట్టణ వాసులు మాత్రం అదేం కాదని వాదించడం విశేషం.

స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన పట్టణం
ఈ పట్టణం 1991 నుంచి ఇలానే ఉంది. వారంతా 17వ శతాబ్దపు డచ్‌ వలసదారుల వారుసులు. దక్షిణాఫ్రికాలోని ఆరెంజ్‌ నది ఒడ్డున సుమారు 8 వేల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసి ప్రవేట్‌ యజామాన్యంతో కలిసి ఒక పట్టణంగా ఏర్పరుచుకున్నారు. అప్పడు ఈ ఒరానియా ప్రాంతంలో జనాభా కూడా తక్కువే. అయితే కాలక్రమేణ వర్ణవివక్ష అనంతరం ఏర్పడిన రాజ్యంగాన్ని అనుసరించి స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన నగరంగా తీర్చిదిద్దుకుంది. అయితే ఆ పట్టణ వాసులు మాత్రం దక్షిణాఫ్రికాలో పీడిస్తున్న నేరాలు, విద్యుత్‌ కోతలు, స్థానికి పాలనలో ఉన్న సమస్యలకు దూరంగా తాము ఏర్పరుచుకున్న కమ్యూనిటీగా అభివర్ణించుకోవడం విశేషం.

దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం, ఒరానియాకు స్వీయ నిర్ణయాధికారం ఉంది, పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది. అంతేకాదు ఈ పట్టణానికి ఒక ప్రత్యేక కరెన్సీ కూడా ఉంది. ఈ పట్టణంలో ఉండాలనుకునే నివాసితులు కొన్ని విలువలను పాటించాలి, భాద్యతగా మెలగాలి, సభ్యుత్వం పొంది ఉండాలి. ఐతే ఒరానియాలో ఉండేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ఇంతవరకు తాము నల్లజాతీయులు దరఖాస్తును అనుమతించకపోవడం వంటివి చేయలేదని ఒరానియా అధికారులు పేర్కొన్నారు.

ఇంతవరకు ఒక్క నల్లజాతీయుడు కూడా ఈ నగరంలో ఉండేందుకు దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ఐతే చాలామంది మాత్రం ఈ పట్టణాన్ని ఆఫ్రికేతర పట్టణంగానూ వర్ణవివక్షతకు పెద్ద పీఠం వేసే ప్రాంతంగానే చూస్తుండటం గమనార్హం. అంతేకాదు దక్షిణాఫ్రికా నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా దేశంతో సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఈ పట్టణాన్ని పునరుద్ధరించటానికి అవిశ్రాంతంగా ప్రయత్నించారు. అందులో భాగంగా 1995లో ఈ ప్రాంతాన్ని సందర్శించి వారితో కలిసి ఉన్నారు కూడా.

(చదవండి: కిమ్‌ జోంగ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం.. కిమ్‌ సోదరి కీలక వ్యాఖ్యలు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top