కెనడాలో ఆలయం వద్ద విద్వేష ఘటన

Temple Vandalised in Canada Ontario, Anti-Hindu, Anti-India Graffiti Painted - Sakshi

టొరొంటో: హిందూ వ్యతిరేక శక్తులు కెనడాలో మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. ఒంటారియో ప్రావిన్స్‌లోని విండ్సర్‌ నగరంలోని బాప్స్‌ స్వామినారాయణ ఆలయ గోడపై భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఇందుకు పాల్పడ్డవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. దీన్ని ఒట్టావాలోని భారత హైకమిషన్‌ తీవ్రంగా ఖండించింది. జనవరిలో సైతం కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది.

ఒంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్‌ నగరంలోని గౌరీశంకర్‌ ఆలయంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గతేడాది సైతం కెనడాలో ఇలాంటి మూడు ఘటనలు జరిగాయి. కెనడా గణాంకాల ప్రకారం 2019–2021 మధ్య మత, లింగ, జాతివిద్వేష నేరాలు 72 శాతం పెరిగాయి. కెనడా జనాభాలో 4 శాతమున్న భారతీయుల్లో ఇవి అభద్రతను పెంచుతున్నాయి. ఈ శక్తులకు అడ్డుకట్టవేయాలని కెనడా సర్కార్‌ను భారత్‌ కోరింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top