కాబుల్‌ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్‌ దాడిగా అనుమానం

Suspected Rocket Attack Rocks District Near Kabul Airport, 2 Killed - Sakshi

Kabul Rocket Attack: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో హమీద్‌ కార్జాయ్‌ విమానాశ్రయానికి అతి సమీపంలో గల జిల్లాలో మరోసారి పేలుడు సంభవించింది. కాబుల్‌ పరిసరాల్లో మరో ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటన జారీ చేసిన గంటల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది. కాబుల్‌ 11వ సెక్యూరిటీ జిల్లాలో జరిగిన ఈ పేలుడు రాకెట్‌ దాడిగా అనుమానిస్తున్నారు.

అమెరికా సైనికులే లక్ష్యంగా ఈ పేలుడు జరిగివుండవచ్చని అంతర్జాతీయ మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో చిన్నారి సహా ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.  మరో ముగ్గురు గాయపడినట్లుగా సమాచారం. కాగా, కొద్ది రోజుల కిందట కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో ఐసిస్‌ ఖోరసాన్‌(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 100 మందికి పైగా చనిపోగా, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చదవండి: మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top