ఏం జరుగుతోంది ఇక్కడ? | Snailor Swift wins the World Snail Racing Championship | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతోంది ఇక్కడ?

Jul 21 2026 10:46 AM | Updated on Jul 21 2026 10:59 AM

Snailor Swift wins the World Snail Racing Championship

ఇక్కడ నత్తల రన్నింగ్‌ రేస్‌ జరుగుతోంది! 
మీరు విన్నది నిజమే..  
నడవడానికే బద్దకించే నత్తలు ఇక్కడ ఏకంగా ‘పరుగులు’తీస్తున్నాయి! యూకేలోని కాంగామ్‌లో జరిగిన ప్రపంచ నత్తల పరుగు పోటీలో వివిధ దేశాలకు చెందిన నత్తలు పాల్గొన్నాయి. ఫుల్‌బాల్‌ ప్రపంచ కప్‌ గెలవకపోయినా.. ఇంగ్లండ్‌ జట్టు ఇక్కడ ఏకంగా స్పెయిన్, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన క్రీడాకారులను ఓడించి.. ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోయింది. ఈ టీంకు చెందిన స్విఫ్ట్‌ అనే నత్త ఉసేన్‌ బోల్ట్‌ పూనినట్లుగా పరుగులు తీసి.. 13 అంగుళాల  దూరాన్ని.. జస్ట్‌ 3 నిమిషాల 30 సెకన్లలో అధిగమించి.. చాంపియన్‌గా నిలిచింది.

ఇంత తక్కువ టైంలో అంటే.. మామూలు
స్పీడా మరి..  
నిజానికి ఈ విభాగంలో ప్రపంచ రికార్డు ఆర్చీ
అనే నత్త పేరు మీద
ఉంది. 1995లో జరిగిన పోటీలో 2 నిమిషాల్లో
13 అంగుళాల దూరాన్ని అధిగమించింది.
ఈ పోటీలు 60 ఏళ్లుగా జరుగుతున్నాయి.
ఈసారి చాంపియన్‌షిప్‌లో 270 నత్తలు పాల్గొన్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement