షిడ్వార్‌ ద్వీపాన్ని చుట్టుముట్టిన చమురుతెట్టు | Oil Spill Near Shidvar Island Triggers Environmental Disaster After Iran Refinery Strikes, Check More Details Inside | Sakshi
Sakshi News home page

షిడ్వార్‌ ద్వీపాన్ని చుట్టుముట్టిన చమురుతెట్టు

May 20 2026 7:44 AM | Updated on May 20 2026 11:52 AM

show Iran war oil spill on Persian Gulf island

దుబాయ్‌: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ భీకర దాడులు మొదలెట్టాక హార్మూజ్‌ జలసంధి సమీపంలోని షిడావ్‌ర్‌ ద్వీపాన్ని చమురుతెట్టు చుట్టేసింది. ఇప్పుడు చమురుతెట్టు అక్కడి జీవావరణంపై గొడ్డలిపెట్టుగా తయారైంది. షిడ్వార్‌ ద్వీపంలోని సముద్రతీరాలను పెద్దమొత్తంలో ముడిచమురుతో జిగటగా తయారైన అలలు పోటెత్తుతున్నాయి. ద్వీపం తీరం మొత్తాన్నీ దాదాపు చమురుతెట్టు ఆక్రమించేసింది. ఈ జీవావరణ విధ్వంసం తాలూకు వివరాలు సంబంధిత ఉపగ్రహ చిత్రాలు, ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. 

ఇరాన్‌లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడుల తర్వాత పెద్దమొత్తంలో ముడిచమురు సముద్రజలాల్లోకి చేరింది. ఇది పల్చని పొరలా సముద్రఉపరితల జలాలపై పేరుకుని అలలరూపంలో సమీప ద్వీపాల తీరాలకు చేరుతోంది. వీటితోపాటు ఇరాన్‌కు చెందిన ఎహ్‌సాన్‌ జలాలీ అనే వ్యక్తితీసిన స్మార్ట్‌ఫోన్‌ వీడియో ఫుటేజీ సైతం షిడ్వార్‌ ద్వీపంలో జరిగిన జీవావరణ విధ్వంసాన్ని కళ్లకుకడుతోంది. తాబేళ్లు, పక్షులు, స్క్వాడ్‌చేపలు, డాలి్ఫన్లు ఇలా పలురకాల జీవులు చమురుతెట్టులో చిక్కుకుని చనిపోతున్నాయి. 30 సెంటీమీటర్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీసే ఎయిర్‌బస్‌ డిఫెన్స్, స్పేస్‌ ప్లీడస్‌ నియో ఆప్టికల్‌ శాటిలైట్‌ ద్వారా తీసిన ఫొటోలనూ తాజాగా విడుదలచేశారు. 

ఏప్రిల్‌ పదో తేదీన ఇరాన్‌లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడి తర్వాత రెండ్రోజులైనా అక్కడి నుంచి మంటలు ఎగిసిపడుతున్నట్లు శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టమైంది. షిడ్వార్‌ ఐలాండ్‌ను స్థానికంగా మరో ద్వీపం అని కూడా పిలుస్తారు. చిత్తడి నేలలకు ఈ ద్వీపం ప్రసిద్ధి. ఇరాన్‌లో కని్పంచే బుల్లి ‘టెర్న్‌’పక్షు లు, సముద్రపక్షులకు ఈ ద్వీపం ఆలవాలంగా ఉంది. చిత్తడినేలలను భూమి సహజ ఊ పిరితిత్తులుగా పేర్కొంటారు. మురుగునీరు విస్తరించకుండాచేసి, భూగర్భజలాలను శుద్ధిచేసే నేలలుగా చిత్తడినేలలుప్రసిద్ధిచెందాయి. ఇప్పుడివి నాశనమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement