డర్టీ బాంబు అంటూ రష్యా గగ్గోలు...భారత రక్షణ మంత్రితో మొర

Russian Defence Minister Call With Rajnath Sing Over Dirty Bomb - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌ డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఒకటే గగ్గోలు పెడుతోంది రష్యా. ఉక్రెయిన్‌తో సహా పాశ్చాత్య దేశాలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. కానీ రష్యా మాత్రం డర్టీ బాండు ఉపయోగిస్తోదంటూ ఉక్రెయిన్‌పై ఆరోపణలు చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వీడియో కాల్‌లో చైనీస్‌ రక్షణ మంత్రి వీ ఫెంఘేతో ఈ విషయమై సంభాషించారు.

ఆ తర్వాత బుధవారం భారత్‌ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడుతూ. ...ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. వాస్తవానికి ఈ డర్టీ బాంబు అనేది రేడియోధార్మిక, జీవ సంబంధమైన రసాయన పదార్థాలతో కూడిన బాంబు. ఇది మానవాళికి అత్యంత ప్రమాదకరమైన బాంబు దాడి. రష్యా మాత్రం పదేపదే నాటో ప్రత్యర్థులతో కలిసి ఉక్రెయిన్‌ డర్టీ బాంబు ఉపయోగించాలని చూస్తోందని ఆరోపణలు చేస్తోంది.

ఒకవైపు అవన్నీ అబద్ధాలు అని ఉక్రెయిన్‌ కొట్టిపారేస్తోంది. ఈ మేరకు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ....ఉక్రెయిన్‌ డర్టీ బాంబు ఉపయోగించనుందన్న పక్కా సమాచారం మా వద్ద ఉంది. అటువంటి విధ్వంసకర చర్యలను నియంత్రించేలా ప్రంపంచ దృష్టికి తీసుకు రావడమే గాక అందుకు తగు చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు. 

(చదవండి: వీడియో: ఉక్రెయిన్‌పై అణుదాడికి అంతా రెడీ?.. పుతిన్‌ పర్యవేక్షణలోనే!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top