అమెరికాలో పీహెచ్‌డీ విద్యార్థుల దారుణ హ‌త్య‌! | Roommate charged In-killings 2 Bangladeshi PhD students in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో పీహెచ్‌డీ విద్యార్థుల దారుణ హ‌త్య‌!

Apr 26 2026 3:17 AM | Updated on Apr 26 2026 4:11 AM

Roommate charged In-killings 2 Bangladeshi PhD students in USA

హత్యకు గురైన పీహెచ్‌డీ విద్యార్థులు, ఇన్‌సెట్‌లో నిందితుడు

అమెరికాలో గత వారం అదృశ్యమైన బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు పీహెచ్ విద్యార్థుల కేసు విషాదంగా మారింది. ఈ ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా  ఈ ఇద్ద‌రిని హ‌త్య చేసిన వ్య‌క్తి వారి రూమ్‌మేట్ కావ‌డం గ‌మనార్హం. ప్ర‌స్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.  

విష‌యంలోకి వెళితే..  బంగ్లాదేశ్‌కు చెందిన జమీల్ లిమోన్, నహీదా బ్రిస్టీలు అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పీహెచ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి కనిపించకుండా పోయారు. అంతకుముందు రోజు వీరిద్దరూ యూనివర్సిటీ క్యాంపస్‌లో చివరిసారిగా కనిపించారు. తాజాగా టంపా బే వంతెనపై యువకుడి మృతదేహం గుర్తించగా, బ్రిస్టీ ఆచూకీ లభ్యం కాలేదు.

అయితే, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ఆమె కూడా మరణించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్లోని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.  కాగా ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో విద్యార్థి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement