వాటి దెబ్బకు పిక్‌నిక్‌ హర్రర్‌ సినిమా అయ్యింది!

Robber Crabs Attacks On Picnic Spot In Australia - Sakshi

మెల్‌బోర్న్‌ : సరదాగా మిత్రులతో కలిసి ఫ్యామిలీ పిక్‌నిక్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి మరిచిపోలేని అనుభవం ఎదురైంది. వారు పిక్‌నిక్‌ జరుపుకుంటున్న ప్రదేశంలోకి పదుల సంఖ్యలో భారీ ఎండ్రకాయలు చొచ్చుకురావటంతో అక్కడి పరిస్థితి హర్రర్‌ సినిమాను తలపించేలా మారింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని బార్‌బిక్యూలో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఎమి లూటిక్‌ అనే మహిళ ఫ్యామిలీ, మిత్రులతో కలిసి క్రిస్టమస్‌ ఐలాండ్‌లోని బార్‌బిక్యూకు పిక్‌నిక్‌ కోసం వెళ్లింది. బీచ్‌కు దగ్గరగా బస చేసిన వారు కబుర్లు చెప్పుకుంటూ, రుచిగా తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. (రాబిన్‌ హుడ్‌ అవతారమెత్తిన డీజీపీ )

ఈ నేపథ్యంలో రాత్రి వేళ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ, పదుల సంఖ్యలో రాబర్‌ క్రాబ్స్‌( పెద్ద సైజు ఎండ్రకాయలు) పిక్‌నిక్ ‌స్పాట్‌లోకి చొచ్చుకువచ్చాయి. దీంతో వారు ఒక్కసారిగా హడలిపోయారు. కొందరు అక్కడినుంచి పరిగెత్తారు. మరికొందరు వాటినుంచి తప్పించుకుని పోవటానికి తెగ శ్రమించారు. ఆ ఎండ్రకాయలు ఇష్టారాజ్యంగా అక్కడ బీభత్సం సృష్టించాయి. క్రిస్టమస్‌ ఐలాండ్‌ టూరిజం అధికారులు ఇందుకు సంబంధించిన ఫొటోలను, సమాచారాన్ని తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేయగా సంఘటన వైరల్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top