బ్రెజిల్‌లో విమానం కూలి..14 మంది మృతి

Plane Crashes In Brazil Amazon Rainforest - Sakshi

రియో డి జనిరో: బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో చిన్న ప్యాసింజర్‌ విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్‌ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్‌ సమీపంలో కూలిందన్నారు.

ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోందన్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది అని అమెజొనాస్‌ రాష్ట్ర గవర్నర్‌ విల్సన్‌ లిమా చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top