కొరియా మరో క్షిపణి పరీక్ష 

North Korea Tests New Weapon To Improve Tactical Nukes - Sakshi

సియోల్‌: ప్రపంచ దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అణు సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా కొత్తగా డిజైన్‌ చేసిన క్షిపణిని ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక మీడియా ఆదివారం వెల్లడించింది. అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారని తెలిపింది. ఈ ప్రయోగంతో ఫ్రంట్‌లైన్‌ ఆర్టిలరీ యూనిట్ల సామర్థ్యం పెరుగుతుందని చెప్పింది. ఈ ఏడాది ఉత్తర కొరియా నిర్వహించిన ప్రయోగాల్లో ఇది 13వది. 
చదవండి: North Korea: కిమ్‌ సంచలన నిర్ణయం.. ఆనందంలో నార్త్‌ కొరియన్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top