హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్ | No permission is required to travel through Hormuz india | Sakshi
Sakshi News home page

హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్

Mar 25 2026 12:01 AM | Updated on Mar 25 2026 12:12 AM

No permission is required to travel through Hormuz india

ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా  యుద్ధం నేపథ్యంలో  భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే ఈ అంశాలపై భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్  మీడియాతో మాట్లాడారు.

హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భద్రత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షిప్పింగ్ కంపెనీలు, వాటి కాంట్రాక్టు సంస్థలు ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ  జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుంది. దీని గుండా నౌకాయానానికి స్వేచ్ఛ ఉంది. ఆ జలసంధి ఇరుకుగా ఉన్నందున, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మాత్రమే గుర్తించారు, వాటిని నౌకా రవాణా సంస్థలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. 

అదే విధంగా జలసంధి గుండా ప్రయాణించాలనే నిర్ణయం షిప్పింగ్ కంపెనీకి, ఓడను అద్దెకు తీసుకున్న కంపెనీకి మధ్య ఉంటుంది. ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ప్రయాణించకూడదు అనేది వారి నిర్ణయం అని తెలిపారు.  అయితే ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నందున వారు నిర్ణయం తీసుకునే ముందు భద్రత మొదలైన వాటికి సంబంధించి పరిస్థితిని అంచనా వేస్తారు.  అంతేగాని హార్మూజ్ గుండా ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని ఆయన తెలిపారు.  

కాగా నిన్న (సోమవారం) మరో రెండు ఎల్‌పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇవి ఈ నెల 26 లేదా  27 తేదీలలో భారత్‌ను చేరుకుంటాయి. వీటివల్ల దేశానికి దాదాపు ఒక రోజు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement