భారత్‌కు సుంకాల బెదిరింపు.. ట్రంప్‌పై నిక్కీ హేలీ సెటైర్లు | Nikki Haley counter to Trump tariff against india | Sakshi
Sakshi News home page

భారత్‌కు సుంకాల బెదిరింపు.. ట్రంప్‌పై నిక్కీ హేలీ సెటైర్లు

Aug 6 2025 7:15 AM | Updated on Aug 6 2025 7:26 AM

Nikki Haley counter to Trump tariff against india

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిక్కుతోచని స్థితిలో భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. మంగళవారం (భారత కాలమాన ప్రకారం) భారత్‌పై సుంకాల మోత మోగిస్తానంటూ ట్రంప్‌ ప్రకటించారు. అయితే, ఈ హెచ్చరికలపై మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ.. ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. అత్యంత కీలక సమయాల్లో ఇలా వ్యవహరిస్తే అమెరికా-భారత్‌ల మధ్య సంబంధాలు సన్నగిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు. కానీ రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనాకు మాత్రం 90 రోజుల పాటు ఎలాంటి సుంకాలు విధించకుండా మినహాయింపు ఇవ్వొచ్చా? అని ప్రశ్నించారు. చైనాకు మినహాయింపు ఇచ్చి.. భారత్‌తో ఉన్న బంధాన్ని దెబ్బతీయకండి’ అని హితువు పలికారు.

అమెరికా-భారత్‌ల సంబంధాలకు నిక్కీ హేలీ సుదీర్ఘంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇండో-పసిఫిక్‌లోని ప్రజాస్వామ్య దేశాలతో, ముఖ్యంగా భారత్‌తో సన్నిహిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ప్రపంచ దేశాల్లో చైనా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తరచూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో మరోసారి అమెరికా-భారత్‌ సంబంధాలను హైలెట్‌ చేస్తూ.. సుంకాలు విధించే విషయంలో ట్రంప్‌ నిర్ణయాన్ని తూర్పారబట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement