మళ్లీ తెరపైకి ఏలియన్ల ఊసు.. అది గ్రహాంతరవాసుల ముద్రేనా?

Nasa US Space Command Released Photos Confirms Aliens Theory - Sakshi

గ్రహాంతరవాసుల ఉనికిపై మరోసారి అమెరికా వరుస ప్రకటనలకు దిగుతోంది. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration).. గ్రహాంతరవాసుల జాడకు సంబంధించిందిగా చెప్తూ ఓ ఫొటోను రిలీజ్‌ చేసింది. తాజాగా యూఎస్‌ స్పేస్‌ కమాండ్.. 2014లో భూమిని ఢీ కొట్టిన ఓ ఉల్కను.. ఇంటర్ స్టెల్లర్‌గా ధృవీకరించింది. ఈ మేరకు పెంటగాన్‌ సైతం ప్రకటన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాసా సైతం ఓ మిస్టరీ ఫొటోను విడుదల చేసి.. ఏలియన్ల ఉనికిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

అంగారక గ్రహాంపై గుర్తు తెలియని ముద్రలకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ రిలీజ్‌ చేయగా.. అది ముమ్మాటికీ ఏలియన్లకు సంబంధించిందేనన్న చర్చ ఊపందుకుంది. మార్టిన్ క్రేటర్‌లోని ఆ గుర్తుల్ని హైరెజల్యూషన్‌ ఇమేజింగ్‌ ద్వారా క్యాప‍్చర్‌ చేసింది నాసా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేయగా.. ఫాలోవర్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. 

ఏలియన్ల ఉనికి తెలుస్తుందా?
2017లో భూమిని తాకిన ఓ శకలాన్ని.. ‘ఒయూమువామువా’గా నామకరణం చేశారు. సాంకేతిక పరిశోధనలతో.. అది ఇంటర్‌ స్టెల్లర్‌(నక్షత్రాల మధ్య) ఆబ్జెక్ట్‌గా తేలింది. అయితే.. అంతకంటే ముందే 2014 జనవరిలో ఓ ఉల్క భూమిని తాకింది. తాజాగా దీనిని కూడా ఇంటర్‌ స్టెల్లర్‌ ప్రాజెక్టుగానే ధృవీకరించింది అమెరికా స్పేస్‌ కమాండ్‌. మరో సౌర వ్యవస్థ నుంచి దూసుకొచ్చిన ఈ స్పేస్‌ రాక్‌ను హార్వార్డ్‌ ఖగోళ పరిశోధకులు అమీర్‌ సిరాజ్‌, అబ్రహం లియోబ్‌లు పరిశోధనలు జరిపి.. ఇంటర్‌ స్టెల్లర్‌ ఆబ్జెక్ట్‌గా నిర్ధారించారు. దీంతో 2017లో భూమిని తాకిన ‘ఒయూమువామువా’ను రెండో ఇంటర్‌ స్టెల్లర్‌ ఆబ్జెక్ట్‌గా తేల్చినట్లు అయ్యింది.

    
  
అటువంటి ఇంటర్‌ స్టెల్లర్(నక్షత్రాల మధ్య) శకలాలు.. గ్రహాంతర జీవుల ఉనికిని ఇతర ప్రాంతాలకు మోసుకెళ్తాయని పరిశోధకులు నమ్ముతారు. ఇంటర్‌ స్టెల్లర్‌ మెటోర్స్‌ అనేవి ఇతర గ్రహాల వ్యవస్థ, అక్కడి ప్రాణుల ఉనికిని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు విశ్వంలో జీవరాశి(పాన్‌స్పెర్మియా) గురించి తెలియజేసేందుకు మధ్యవర్తిత్వం లాగా అవి పని చేస్తాయని అబ్రహం లోయిబ్‌ అంటున్నారు. అయితే.. 2014 ఉల్క సంగతి ఏమోగానీ.. ఒయూమువామువా మాత్రం ఆస్టరాయిడ్‌ అనడం కంటే.. ఏలియన్‌ టెక్నాలజీకి సంబంధించిన వస్తువుగా దాదాపు నిర్ధారణ అయినట్లు చెప్తున్నారు. హాలీవుడ్‌లో ఇంటర్ స్టెల్లర్ మూవీ.. అదే ఏడాది నవంబర్‌లో రిలీజ్‌ కావడం కొసమెరుపు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top