రోబోలతో రోబోల కోసం

NASA Plans Build Space Center With The Help Of Robots - Sakshi

చందమామని అందుకోవాలన్న భారత్‌ కలలు ఈ ఏడాది కొంతవరకు ఫలించాయి. ఇస్రో చంద్రయాన్‌–2 ఇంచుమించుగా విజయం సాధించింది. చిన్న సాంకేతిక లోపంతో చంద్రుడిపైకి వెళ్లి కూడా నిలబడలేకపోయింది. ఒకట్రెండు సంవత్సరాల్లో చంద్రుడిపైకి మనుషుల్ని పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారకుడిపైకి మనుషుల్ని పంపే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జపాన్‌ మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. 2020లో చంద్రుడిపై ఒక స్థావరం నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్థావరం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని రోబోలే నిర్మిస్తాయి. ఆ స్థావరంలో రోబోలే ఉంటాయి. చంద్రుడికి ఆవలివైపు వెళ్లాలన్నా, ఖగోళ రహస్యాలను ఛేదించాలన్నా, అంగారకుడిపై పరిశోధనలు చేయాలన్నా చంద్రుడిపై ఇంధనం నింపుకోవడానికి ఒక స్థావరం ఎంతో అవసరం. చంద్రుడిపై హీలియం నిల్వలు ఉన్నాయని భావిస్తుండటంతో అక్కడే ఇంధనం తయారు చేయొచ్చన్న ఆలోచనలూ ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top