పండోరా క్లస్టర్‌

NASA James Webb Space Telescope Uncovers New Details In Pandora Cluster - Sakshi

అంతరిక్షంలో మనకు సుదూరంలో ఉన్న ‘పండోరాస్‌ క్లస్టర్‌’ తాలూకు అద్భుత దృశ్యాలివి. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ వీటిని తొలిసారిగా తన అత్యాధునిక నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా సాయంతో ఇలా అందంగా బంధించింది! మూడు భారీ గెలాక్సీల సమూహాలు పరస్పరం కలసిపోయి ఒక మెగా క్టస్టర్‌గా ఏర్పడ్డ తీరును నాన్ని కూడా ఈ క్లస్టర్లో గమనించవచ్చని నాసా చెబుతోంది.

అంతేగాక ఈ కలయిక వల్ల పుట్టుకొచ్చిన అతి శక్తిమంతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల పండోరాకు ఆవల మరింత సుదూరాల్లోని గెలాక్సీలను కూడా పరిశీలించడం జేమ్స్‌ వెబ్‌కు సులువుగా మారిందట! పండోరా క్లస్టర్‌ను భూమి నుంచి ఇంత స్పష్టంగా వీక్షించగలగడం ఇదే తొలిసారి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top