Meet Actress Natasha Bassett Elon Musk New Girlfriend: కొత్త ప్రేయసితో కెమెరాకు చిక్కిన ఎలన్‌ మస్క్‌! - Sakshi
Sakshi News home page

Elon Musk: కొత్త ప్రేయసితో కెమెరాకు చిక్కిన ఎలన్‌ మస్క్‌! పరుగో పరుగు.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Feb 21 2022 4:16 PM | Updated on Feb 21 2022 8:52 PM

Meet Natasha Bassett Elon Musk New Girl Friend - Sakshi

ఆమె ప్రేమలో పడింది ఎలన్‌ మస్క్‌ డబ్బు చూసి కాదట.. ఆయనకు ఉన్న

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ కొత్త పిట్టను పట్టాడు. డేటింగ్‌లో ఏకంగా ఒక బిడ్డను కన్న తర్వాత.. ప్రేయసి గ్రిమ్స్‌కు టాటా చెప్తున్నాడంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి.  అయితే తాజాగా మస్క్‌ ఓ ముసుగురాణితో అడ్డంగా దొరికిపోగా.. ఆమె ఎవరో ఆచూకీ పట్టేసింది బ్రిటన్‌ మీడియా.

లాస్‌ ఏంజెల్స్‌లో తన ప్రైవేట్‌ జెట్‌ వద్ద ఎలన్‌ మస్క్‌, ఓ యువతితో దిగుతూ కనిపించాడు. పొడగాటి కోటు, నల్ల కళ్లద్దాలు ధరించిన ఆ యువతి.. కెమెరాలు కనిపించేసరికి తన ముఖం దాటేసేందుకు ప్రయత్నించింది. ముఖాన్ని కప్పేసుకుని వేగంగా అక్కడి నుంచి పరుగులు అందుకుంది. ఆమెను అనుసరిస్తూ మస్క్‌ సైతం కారు దగ్గరికి పరుగులు తీశాడు. ఈ తరుణంలో డెయిలీ మెయిల్‌ పత్రిక.. మస్క్‌తో ఉన్న ఆమె ఆస్ట్రేలియా నటి నటాషా బస్సెట్‌ అని తేల్చింది.

ఎవరీ నటాషా.. 

27 ఏళ్ల నటాషా బస్సెట్‌ సిడ్నీలో పుట్టిపెరిగింది. 14 ఏళ్లకే ఆమె యాక్టింగ్‌ కెరీర్‌ను మొదలుపెట్టింది. యాక్టింగ్‌ కోసం 2019లో న్యూయార్క్‌కు వెళ్లింది. నటిగానే కాదు.. జంతుపరిరక్షణ ఉద్యమకారణిగా, గ్లోబల్‌ వార్మింగ్‌ ఉద్యమకారిణిగానూ ఆమెకు పేరుంది.  ఇదిలా ఉండగా.. వీళ్లిద్దరి ఫొటోలు బయటకు రాగానే ఓ మీడియా హౌజ్‌ నటాషాను ఇంటర్వ్యూ చేసింది. తాను మస్క్‌(ఎలన్‌ మస్క్‌) బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూసి ప్రేమించలేదని, ఆయన మేధస్సును చూసి ఇష్టపడ్డానని ఆమె వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఓ ఈవెంట్‌లో కలుసుకున్న ఈ ఇద్దరూ.. తర్వాత మంచి స్నేహితులు అయ్యారట. గ్రిమ్స్‌తో మస్క్‌ దూరం అయ్యాక.. ఈ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు.


ఎలన్‌ మస్క్‌.. నటాషా

అయ్యగారి లిస్ట్‌
గతంలో పలువురితో డేటింగ్‌ చేసిన మస్క్‌.. కెనడియన్‌ రచయిత జస్టిన్‌ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఓ బిడ్డ పుట్టగా.. పది వారాలకే సడన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌​ సిండ్రోమ్‌ కారణంగా కన్నుమూసింది. ఆ తర్వాత ఐవీఎఫ్‌ ద్వారా 2004లో కవలల్ని, 2006లో ట్రిప్‌లెట్స్‌(ఒకే కాన్పులో ముగ్గురు)ను కన్నది ఈ జంట.

ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్‌ నటి టలులాహ్‌ రిలేతో డేటింగ్‌ చేశారు. 2010లో రిలేను వివాహం చేసుకుని.. 2012లో విడాకులిచ్చాడు.  ఆ మరుసటి ఏడాది రిలేను మళ్లీ పెళ్లి చేసుకున్న మస్క్‌..  చివరికి 2016 రిలేకు సైతం విడాకులిచ్చేశాడు.

ఆ తర్వాత దక్కిన ఫేమ్‌, డబ్బుతో సెలబ్రిటీలతో కొంతకాలం డేటింగ్‌ చేశాడు. 2017లో నటి అంబర్‌ హర్డ్‌తో కొంతకాలం డేటింగ్‌ చేసినట్లు పుకార్లు వినిపించగా.. హర్డ్‌ మాజీ భర్త జానీ డెప్‌ ఆ ఆరోపణలు నిజమేనని ఆరోపించాడు.

అయితే మస్క్‌, హర్డ్‌లు ఇద్దరూ ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ వస్తున్నారు. 2018 నుంచి కెనెడియన్‌ సింగర్‌ గ్రిమ్స్‌(క్లెయిర్‌ బౌచర్‌)తో డేటింగ్‌ మొదలుపెట్టాడు మస్క్‌. 2020 మే నెలలో వీళ్లిద్దరూ ఓ కొడుకు పుట్టగా(ఎలన్‌ మస్క్‌ ఏడో బిడ్డ).. ఎవరికీ అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు ఈ టెస్లా బాస్‌. అప్పటి నుంచి ఈ జంట కొడుకును వెంటపెట్టుకునే చాలాసార్లు కెమెరా కళ్లకు చిక్కింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కొడుకు బాధ్యతను మాత్రం ఇద్దరూ కలిసే చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.


మాజీ ప్రేయసి గ్రిమ్స్‌.. కొడుకు  X AE A-XIIతో మస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement