ప్రపంచానికి మరో ముప్పు.. ఈసారి కరోనాకు మించిన మహమ్మారి.. వైరస్‌ సోకితే అంతే..!

Marburg Virus After Corona WHO Warns One More Epidemic - Sakshi

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కకావికలం చేసిన విషయం తెలిసిందే. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్‌ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. అయితే రాబోయో రోజుల్లో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా విసరబోతుందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

మార్బర్గ్ అనే వైరస్ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగుచుశాయని, ఈ రోగులకు సరైన చికిత్స అందించి.. వైరస్‌ను కట్టడి చేయలేకపోతే మరో మహమ్మారిలా విశ్వమంతటా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి దీనికి 'డిసీజ్‌-ఎక్స్' గా నామకరణం చేసింది.

డిసీజ్-ఎక్స్ ఎబోలా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి సోకినవారిలో 80 శాతం మంది రోగులు మరణిస్తారు. ఇప్పటికే కోట్ల మంది కరోనా బారినపడ్డారు. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గింది. ఈ సమయంలో డిసీజ్-ఎక్స్ ఎటాక్ చేస్తే వాళ్లు తట్టుకోలేరని, కరోనా కంటే ఊహించని ప్రాణనష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మందు లేదు..
డిసీజ్-ఎక్స్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ గానీ, ఔషధాలు గానీ అందుబాటులో లేవు. దీనికి సంబంధించిన సమాచారం కూడా లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది మరో మహమ్మారిలా పరిణమిస్తే మానవాళి మనుగడకే ప్రమాదమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ ఇంకా పూర్తిగా కోలేదు. అన్ని దేశాల్లో ఇప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డిసీజ్-ఎక్స్ కేసులు పెరిగి విశ్వమంతా వ్యాపిస్తే.. ఆ పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది.
చదవండి: ఎలాన్‌ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్‌కు అధికార పార్టీ గుడ్‌బై..

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top