Manisha Ropeta: పాకిస్తాన్‌లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్‌.. ఎందరికో ఆదర్శం

Manisha Ropeta Was First Hindu Woman Senior Police In Pakistan - Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌లో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ హిందువులకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారిని చిన్నచూపు చూస్తారు. కానీ, తాజాగా ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్‌లో సంచలనం క్రియేట్‌ చేశారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన హిందూ మహిళ మనీషా రోపేటా(26) రికార్డులు బ్రేక్‌ చేశారు. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుందన్న తొలి హిందూ మహిళగా గుర్తింపు పొందారు. ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా హిస్టరీ క్రియేట్‌ చేశారు. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో మనీషా నిలిచారు. కాగా, ప్రస్తుతం.. మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్‌ చెందిన మనీషా.. మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించడంతో.. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు. డీఎస్పీగా బాధత్యలు స్వీకరించిన తర్వాత మనీషా రోపేటా మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి.. తాను, తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్టు తెలిపారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్టు స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో అమ్మాయిలకు ఎక్కువగా.. డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. పోలీసు శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా...యూఎస్‌కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top