‘ప్రపంచానికి ఇలాంటి వ్యక్తులు కావాలి’

Man Saves Tiny Little Bird From Drowning In The Sea Video Goes Viral - Sakshi

న్యూఢిల్లీ: సముద్రంలో మునిగిపోకుండా చిన్న పక్షిని ఓ వ్యక్తి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.‌ శనివారం ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్‌లను తెగ ఆ​కట్టుకుంటోంది. ఇంగ్లాండ్‌కు చెందిన సైమన్‌ బీఆర్‌ఎఫ్సీ హాప్కిన్స్‌ అనే సంస్థ తన ట్విటర్‌ పేజీలో‌ ‘ప్రపంచానికి ఇంకా ఇలాంటి వ్యక్తులు కావాలి’ అనే క్యాప్షన్‌కు రెండ్‌ హార్ట్‌ ఎమోజీని జత చేసి ట్వీట్‌‌ చేసింది. సముద్రం మధ్యలో నీటిపై కొట్టుకుంటున్న ఆ పక్షిని కాపాడటమే కాకుండా దానికి ఆహారం పెట్టిన అతడిపై నెటిజన్‌లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 5 వేలకు పైగా వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. (చదవండి: ఊహల్లోనే ఇవి సాధ్యం.. కానీ చేసి చూపించారు)

‘ఇది నన్ను ఎంతో ఆకట్టుకుంది’, ‘అందమై వ్యక్తి, పక్షి’, ‘అవును.. ప్రపంచానికి ఇలాంటి వ్యక్తులు అవసరం’ అంటూ నెటిజన్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. 58 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బోటులో సుముద్ర పర్యటనకు వెళ్లిన వ్యక్తి సాగరం మధ్యలో ఆ పక్షి నీటిపై కొట్టుకోవడం​ గమనించాడు. వెంటనే ఆ వ్యక్తి పక్షిని తన చేతుల్లోకి తీసుకుని పడవలో దించాడు. నీటి తేమ లేకుండా ఆరబెట్టి, దానికి ఆహారం​ పెట్టాడు. ఆ తర్వాత నీటిని తాగించి ఆ పక్షితో కాసేపు సరదాగా ఆడుకున్నాడు. ఇక ఒడ్డు దగ్గరికి చేరుకోగానే ఆ పక్షిని ఆకాశంలోకి వదిలాడు. (చదవండి: అనుకోని అతిథి.. ఎక్కడివారక్కడే గప్‌చుప్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top