షార్క్‌ చేపతో ముఖాముఖి షూటింగ్‌: షాకింగ్‌ వైరల్‌ వీడియో!!

Man Captured The Stunning Video Of Face To Face White Shark - Sakshi

షార్క్‌ చేపలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసిందే. అయితే ఈ షార్క్‌ చేపలను వీడియో తీసేటప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిజానికి వాటికి తెలియకుండానే వీడియో తీస్తారు గానీ నేరుగా తీసే ధైర్యం మాత్రం చేయరు. అలాంటిది ఈ వ్యక్తి ఏకంగా షార్క్‌ చేపను నేరుగా కొన్ని నిమిషాల పాటు వీడియో తీశాడు.

అసలు విషయంలోకెళ్లితే...డేవిడ్ షెర్రర్ అనే చేపల పట్టే వ్యక్తి  నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున డైవింగ్‌ చేస్తూ ఒక అద్భుతమైన తెల్ల షార్క్‌ చేప ఫుటేజ్‌ని తీశాడు. అయితే అతను ఆ షార్క్‌  చేపను చాలా దగ్గర నుంచి(ముఖాముఖి) వీడియో తీశాడు. ఒకనొక దశలో ఆ చేప అతనికి దగ్గరగా సమీపించడమే కాక చేతిలో ఉన్న గన్‌ని చూసి తనను తాను రక్షించుకునే నిమిత్తం వెనుదిరుగుతుంది కూడా. ఎంతోమంది ఈ షార్క్‌ చేపలను వీడియో తీశారు గానీ ఇలా షార్క్‌ చేపకు అతి చేరువలో నేరుగా వీడియో చిత్రీకరించలేదు. అతని అదృష్టమో ఏమో గానీ అతనిపై మాత్రం దాడిచేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా వీక్షించండి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top