మాలిలో మూడేళ్ల పాటు సైనిక పాల‌నే : జుంటా

Mali Junta Agrees To Free President, Wants 3 Year Military Rule - Sakshi

మాలి :  అధికారాన్ని చేజిక్కించుకున్న జుంటా.. సైనిక నేతృత్వంలోనే మూడేళ్లపాటు ప‌రిపాలన కొన‌సాగ‌నున్న‌ట్లు  వెల్ల‌డించింది. ఇందుకు బ‌దులుగా అప‌హ‌ర‌ణ‌కు గురైన మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతాను విడుదల చేయడానికి అంగీకరించినట్లు ప్రతినిధుల బృందం తెలిపింది. మాలిలో మూడేళ్ల‌పాటు  సైనిక  నేతృత్వంలోని ఒక సంస్థ నాయకత్వం వహిస్తుందని అతనే దేశాధినేతగా కొన‌సాగుతాడు అని జుంటా స్ప‌ష్టం చేసింది. గ‌త‌ కొన్నాళ్లుగా తిరుగుబాటు జండా ఎగ‌రవేస్తున్న.. జుంటా ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అధికారాన్ని చేజిక్కించుకున్న నేప‌థ్యంలో కీతా‌ను విడుద‌ల చేస్తామ‌ని అంతేకాకుండా అత‌ను చికిత్స నిమిత్తం విదేశాల‌కు కూడా వెళ్ల‌వ‌చ్చున‌ని పేర్కొన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. (మూతి పగులగొడతా: బ్రెజిల్ అధ్యక్షుడు)

ఇక దేశంలో నిర‌స‌న‌సెగ‌లు వెల్లువెత్తుతున్న వేళ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ప్ర‌ధాని బౌబౌ సిస్సేను సుర‌క్షిత ప్రాంతానికి త‌రలించారు. బౌబాకర్ కీతను అదుపులోకి తీసుకోవ‌డంతో సిస్పేకు భ‌యం ప‌ట్టుకుందంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపించారు. జుంటా చ‌ర్య‌కు మ‌ద్ధ‌తుగా ప్రతిప‌క్ష నేత‌లు సంబురాలు జ‌రుపుకున్నారు.  గ‌త ఎనిమిదేళ్ల కాలంలో మాలిలో నాయ‌కత్వంపై తిరుగుబాటు జ‌ర‌గ‌డం ఇది రెండోసారి. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోతున్నా ఏమీ చేయ‌లేని అస‌మ‌ర్థ అధ్య‌క్షుడు కీత రాజీనామా చేయాల‌ని పిలుపునిచ్చారు. గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌భుత్వంపై తిరుగుబాటు పెర‌గ‌డంతో ప్ర‌జ‌ల కోస‌మే జుంటా ప‌నిచేస్తుంద‌ని ప్ర‌క‌టించుకుంది. ఈ నేప‌థ్యంలో త‌గిన స‌మ‌యంలో ఎన్నిక‌ల‌ను  నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేసింది. రాజ్యాంగ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా జుంటా ప‌నిచేస్తుంద‌ని తెలిపింది. అయితే కొంద‌రు మ‌ద్ద‌తుదారులు మాత్రం కీతానే తిరిగి అధ్య‌క్షుడిగా నియ‌మించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. (కోమాలోకి కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. సోదరికి అధ్యక్ష బాధ్యతలు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top