ఉత్తర కొరియా కిమ్‌: ప్రపంచంలోనే ఎవరికీ లేనిది.. ఆ భయంతోనే అలాంటి ఏర్పాట్లు!

Luxurious But Life Of North Korea Kim Jong Un Family - Sakshi

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీరు గురించి, ఆయన పాలనా విధానాల గురించి, చివరాఖరికి ఆరోగ్యం గురించి కూడా ప్రపంచం బోలెడంత చర్చించుకుంటోంది. కానీ, ఎందుకనో వ్యక్తిగత విషయాలు మాత్రం పెద్దగా వెలుగులోకి రావు. అంతలా రహస్య జీవనం కొనసాగిస్తోంది ఆయన కుటుంబం. అయితే.. తాజాగా ఆయన తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.  

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన కూతురితో గత వారం జరిగిన ఓ క్షిపణి పరీక్షకు హాజరు కావడం.. ఆమె చేతి పట్టుకుని కలియదిరగడం.. టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా నిలిచింది. అయితే.. ఆమె వివరాలపై ఇప్పుడు న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం  స్పష్టత ఇచ్చే యత్నం చేసింది. 

కిమ్‌ జోంగ్‌ కూతురి పేరు జు ఏ. వయసు తొమ్మిదేళ్లు. కాంగ్వాన్‌ ప్రావిన్స్‌లోని వోన్సన్‌ దగ్గర ఓ విలాసవంతమైన విల్లాలో ఆమె ఉంటోంది. ఆ విల్లా.. ప్రపంచంలో అత్యంత లగ్జరీ రిసార్ట్‌లలో ఒకటిగా పేరున్న మార్‌-ఎ-లాగో(డొనాల్డ్‌ ట్రంప్‌ ఓనర్‌) తరహాలోనే ఉంటుందని న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది.

► ఉత్తర కొరియాలో అత్యంత ధనిక కుటుంబం కిమ్‌ జోంగ్‌ ఉన్‌దే. ఆ దేశవ్యాప్తంగా కిమ్‌ కుటుంబానికి పదిహేను మాన్షన్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. దేశం ఆర్థికంగా చితికిపోయినప్పటికీ.. తన విలాసాల విషయంలో కిమ్‌ కాంప్రమైజ్‌ కాడు. ఆహారం దగ్గరి నుంచి ప్రతీ దాంట్లోనూ దర్పం ప్రదర్శిస్తుంటాడు.

► అంతేకాదు.. ఆయా భవనాల్లో భారీ స్విమ్మింగ్‌ పూల్స్‌, టెన్నిస్‌ కోర్టులు, ఫుట్‌బాల్‌ మైదానాలు, వాటర్‌స్లైడ్స్‌, స్పోర్ట్స్‌ స్టేడియం.. ఇలా ఎన్నో హంగులు ఉన్నాయని పేర్కొంది. ఇవిగాక.. 

► తన కుటుంబం గురించి ఎలాంటి సమాచారం మీడియాకు చిక్కడానికి వీల్లేదనే ఆంక్షలు కఠినంగా అమలు చేసేవాడు. గతంలో తన కుటుంబం వివరాలను దక్షిణ కొరియాకు సమర్పించిన ఇద్దరు అధికారులను.. నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపినట్లు ఒక ప్రచారం ఉంది.

బహుశా.. ప్రపంచంలో ఎవరికీ లేనంత గోప్యత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఆయన కుటుంబ విషయంలోనే ఉండొచ్చని న్యూయార్క్‌ పోస్ట్‌ అభిప్రాయపడింది.

► ఆ కుటుంబ ప్రయాణాలు.. రహస్యంగా జరుగుతాయి. దాదాపుగా అండర్‌గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ ద్వారానే జరుగుతుందని, ఈ సొరంగాల గుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైల్వే నెట్‌వర్క్‌ మార్గాల్లో కిమ్‌ సైతం ప్రయాణిస్తుంటారని  తెలిపింది. తద్వారా శత్రు సైన్యాల దాడుల నుంచి తప్పించుకోవడంతో పాటు విదేశీ నిఘా సంస్థల రాడార్‌లకు చిక్కకుండా జాగ్రత్త పడతారని తెలిపింది. 

► కిమ్‌ దేశంలో కెల్లా తానే ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఇందుకోసం సుప్రీం అనే హోదాను అడ్డుపెట్టుకుని.. ప్రజల్ని, ముఖ్యంగా యువతను నియంత్రిస్తూ ముందుకు వెళ్తున్నారు. 

► పాశ్చాత్య సంస్కృతి తన దేశంలో మనుగడలో ఉండకూడదనేది కిమ్‌ ఉద్దేశం. అందుకే అక్కడ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై నిషేధం విధించారు. కాదని ఉల్లంఘిస్తే.. బానిస శిక్షలు అమలు అవుతుంటాయి. పొరుగున ఉండే దక్షిణ కొరియా కల్చర్‌ కనీసం.. మచ్చుకు కూడా కనిపించదు!.

► కిమ్‌ తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి పెద్దగా ప్రదర్శించింది లేదు. ఆయన భార్య రి సోల్‌ జూ కూడా చాలా అరుదుగా మీడియా కంటపడుతుంటారు. మరోవైపు కిమ్‌ వారసత్వం బాధ్యతలు పుచ్చుకునేది ఎవరనే చర్చ.. అప్పుడప్పుడు కొరియన్‌ మీడియాలో జరుగుతూ ఉంటుంది. సోదరి మాత్రం అధికారికంగానే కీలక పదవిలో ఉంటూ.. నిత్యం మీడియాలో కనిపిస్తూ.. అమెరికా, దక్షిణ కొరియా వ్యతిరేక ప్రకటనలూ జారీ చేస్తుంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top