అమెరికా అధ్యక్షుడికి క్రెమ్లిన్‌ కౌంటర్‌.. మీ సంగతి చరిత్ర చెప్తుంది

Kremlin Condemns Joe Biden Genocide Comments On Russia Unacceptable - Sakshi

మాస్కో:ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలను రష్యా తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌లో పుతిన్ బలగాలు మారణహోమానికి పాల్పడ్డాయని బైడెన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ర‌ష్యా ఊచ‌కోత‌కు పాల్పడుతున్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు త్రీవమైన విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా బైడెన్‌ ఆరోపణలపై స్పందించిన రష్యా.. ఇటీవలి చరిత్రలో అత్యధిక యుద్ధ నేరాలకు పాల్పడిన దేశం అమెరికా అని మండిపడింది.

ఆధునిక చరిత్రలో దారుణమైన మారణహోమాలకు మారుపేరైన అమెరికా.. రష్యాపై ఇటువంటి ఆరోపణలు చేయండి సరికాదని దుయ్యబట్టింది. నరమేధం పేరుతో అంతర్జాతీయ సమాజం ముందు రష్యాను తప్పుగా చూపడం మానుకోవాలని హితవు పలికింది. ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉన్న రష్యా వ్యాపార‌, రాజ‌కీయ‌వేత్త విక్టర్ మెద్వెచ‌క్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సత్సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను క్రెమ్లిన్‌ తప్పుపట్టింది.

విక్టర్ మెద్వెచ‌క్‌ను ఉక్రెయిన్‌ సైన్యం అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. పుతిన్‌కు ఓ ప్రతిపాదన కూడా చేశారు. మెద్వెచ‌క్‌ను వదిలిపెడతామని.. దానికి బదులుగా రష్యా బలగాల వద్ద బంధీలుగా ఉన్న తమ దేశ పౌరుల(అమ్మాయిలు, అబ్బాయిలు)ను విడుద‌ల చేయాల‌ని జెలెన్‌ స్కీ రష్యాను కోరిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top