యుద్ధానికి సన్నద్ధమయ్యేలా కసరత్తులు: కిమ్‌ ఆదేశం

Kim Jong Un Orders Intensified Real War Drills - Sakshi

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శుక్రవారం తన సైన్యాన్ని రియల్‌ వార్‌ కోసం కసరత్తులను మరింత తీవ్రతరం చేయమని ఆదేశించారు. ఈ సైనికి డ్రిల్‌ను ఆయన తన కుమార్తెతో కలిసి పర్యవేక్షించారు. కిమ్‌ ఆయన కుమార్తె ఇద్దరు నల్లటి జాకెట్లు ధరించి అధికారులతో కలిసి ఫిరంగి యూనిట్‌ క్షిపణుల మాస్‌ ఫైరింగ్‌ను వీక్షించారు. అయితే దక్షిణ కొరియా ఆ ప్రదేశం నుంచి ఉత్తరకొరియా ఒక బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం జరిపినట్లు గుర్తించామని, అక్కడ నుంచి మరిన్ని క్షిపణి ప్రయోగాలు జరిగే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

అంతేగాక అదికారిక కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ(కేసీఎన్‌ఏ) శుక్రవారం విడుదల చేసిన ఛాయచిత్రల ప్రకారం.. ఉత్తర కొరియా ఆరు క్షిపణులను ఒకేసారి పేల్చినట్లు చూపించాయి. ఇది స్ట్రైక్‌ మిషన్ల కోసం శిక్షణ పొందిందని కేసీఎన్‌ఏ తెలిపింది. ఉత్తర కొరియా పశ్చిమ జలాలే లక్ష్యంగా శక్తిమంతమైన దాడులు జరిగినట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు రెండు వ్యూహాత్మక మిషన్లను సిద్ధం చేశాడని.. ఒకటి యుద్ధాన్ని నిరోధించడానికి, రెండోది యుద్ధానికి సిద్ధం కావడం అని కిమ్‌ సైనికులు చెప్పారు.

నిజమైన యుద్ధం కోసం వివిధ పరిస్థితుల్లో, విబిన్న రీతిలో ఎదర్కొనేలా కరత్తులను మరింత తీవ్రతరం చేయమని సైనికులను కిమ్‌ ఆదేశించాడు. దక్షిణ కొరియా, అమెరికా తోకలిసి సోమవారం అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్తర కొరియా ఈ డ్రిల్‌ నిర్వహించింది. కాగా, రెండు కొరియాల మధ్య దశాబ్దాలుగా సంబంధాలు మరింత క్షీణిస్తుండగా..మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో దక్షిణ కొరియా ప్రతిస్పందనగా.. వాషింగ్టన్‌తో భద్రతా సహకారాన్ని పెంచుకుంటోంది. 

(చదవండి: చైనా అధ్యక్షుడిగా మరోసారి జిన్‌పింగ్‌! ముచ్చటగా మూడోసారి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top