వారి విడుదల విషయంలో జోక్యం చేసుకోండి

Isarael Pm Wife Letter To Pope On Hostages Release - Sakshi

జెరూసలెం: ఇజ్రాయెల్‌ ప్రధాని‍ బెంజమిన్‌ నెతన్యాహు భార్య సారా నెతన్యాహు పోప్‌ ఫ్రాన్సిస్‌కు ఒక లేఖ రాశారు. గాజాలో హమాస్‌ వద్ద ఇప్పటికీ బందీలుగా ఉన్న 129 మందిని వెంటనే విడిపించే విషయంలో జోక్యం చేసుకోవాలని పోప్‌ను కోరారు. అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన దాడి యూదులపై హిట్లర్‌ జరిపిన మారణకాండ తర్వాత అత్యంత పెద్దదని లేఖలో ఆమె అభివర్ణించారు. 

‘ఇజ్రాయెల్‌పై హమాస్‌ అక్టోబర్‌ 7న దాడి జరిపింది. దాడిలో భాగంగా కొంత మందిని హమాస్‌ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. 78 రోజులు గడుస్తున్నా 129 మంది ఇప్పటికీ హమాస్‌ చెరలో బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్న వారిలో కొంత మంది గాయాలు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. హమాస్‌ ఉగ్రవాదులు వారికి కనీస మందులు కూడా ఇవ్వడం లేదు. బందీలంతా ఆకలితో ఉన్నారు’ అని సారా తన లేఖలో పోప్‌ దృష్టికి తీసుకువెళ్లారు. 

‘హమాస్‌ జరిపిన దాడి యూదులపై హిట్లర్‌ మారణకాండ తర్వాత అత్యంత పెద్దది. ఇజ్రాయెల్‌ వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే ఘటన లేకుండా జరిగిన అక్టోబర్‌ 7 దాడుల్లో అమాయక పౌరులను హమాస్‌ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. చిన్న పిల్లలను సజీవ దహనం చేశారు. ఆడవారిపై అత్యాచారాలు చేశారు. కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు’ అని లేఖలో సారా వివరించారు. 

ఇదీచదవండి..యుద్ధం ఎఫెక్ట్‌.. కళ తప్పిన క్రీస్తు జన్మస్థలం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top