టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేసిన వెంటనే ఇరాన్ మరింత అప్రమత్తమైంది. అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని పేల్చేసింది.
‘హార్మూజ్ దీవి సమీపంలో, ఇరాన్ దక్షిణ తీరంపై అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని అడ్డగించాం. ఎఫ్-15 యుద్ధ విమానాన్ని మా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి’ అని ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ ఎక్స్‌లో పేర్కొంది. ఆ యుద్ధ విమానాన్ని కూల్చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.
కాగా, అమెరికాకు చెందిన అతి భీకర ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూడా ఇరాన్ అతి తక్కువ ఖర్చుతో ఢీకొట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎఫ్-35 యుద్ధ విమానాల చరిత్రలో ఇటువంటిది మునుపెన్నడూ జరగలేదు. ఎఫ్-35 అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధ విమానం. ఇది శత్రు రాడార్లకు చిక్కదు. ఈ స్టెల్త్ యుద్ధ విమాన ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూడా కూల్చేశామని ఇరాన్ చెబుతూ ఆధారాన్ని కూడా పోస్ట్ చేసింది.
మరోవైపు, యుద్ధం వేళ నిరాధార వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. యూరప్‌పై ఇరాన్ క్షిపణులను ఎక్కుపెట్టిందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ఎలాంటి ఆధారం లేదని యూకే తెలిపింది. యూరప్‌పై క్షిపణి దాడులకు ఇరాన్ ప్రణాళికలు వేసుకుంటోందని, అంతటి సామర్థ్యం ఇరాన్‌కు ఉందనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని బ్రిటన్ తెలిపింది.
లండన్, పారిస్, బెర్లిన్ వంటి నగరాలను చేరే క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపిన తరువాత బ్రిటిష్ కేబినెట్ మంత్రి స్టీవ్ రీడ్ ఆ వాదనను తిరస్కరించారు.
ఇరాన్ మీడియా పోస్ట్ చేసిన వీడియో
An enemy's F-15 fighter jet was shot down by Iranian air defense systems near Hormuz Island after being intercepted over the country’s southern coast.
Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/x8kYuQGR6o— Press TV 🔻 (@PressTV) March 22, 2026


