పాక్‌కు ట్రంప్‌ ప్రతినిధులు.. ఇరాన్‌ వెళ్లట్లేదా? | Iran currently has no decision to send a negotiating delegation to Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌కు ట్రంప్‌ ప్రతినిధులు.. ఇరాన్‌ వెళ్లట్లేదా?

Apr 19 2026 9:36 PM | Updated on Apr 19 2026 9:38 PM

 Iran currently has no decision to send a negotiating delegation to Pakistan

టెహ్రాన్‌: అమెరికా ప్రతినిధులు ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు సోమవారం (ఏప్రిల్‌ 20) సాయంత్రం వెళ్తున్నారని యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమెరికా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా ఇరాన్‌ మాత్రం కనీసం ఇస్లామాబాద్‌కు వెళ్తున్నామా? లేదా? అన్న విషయాన్ని కూడా చెప్పడం లేదు.  

ఇరాన్ ఇప్పటి వరకు పాకిస్థాన్‌కు చర్చల కోసం తమ టీమ్‌ను పంపే విషయంలో నిర్ణయం తీసుకోలేదని తస్నీమ్ వార్తా సంస్థ తెలిపింది. నౌకాదళ నిర్బంధం కొనసాగుతుండడంతో ఇస్లామాబాద్‌కు చర్చల బృందాన్ని పంపే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇరాన్ తెలిపింది.  

“ట్రంప్ ప్రకటించిన నౌకాదళ నిర్బంధం కొనసాగుతున్నంత వరకు ఎలాంటి చర్చలు ఉండవు అని ఇరాన్ టీమ్‌ స్పష్టం చేసింది” అని తస్నీమ్ ప్రతినిధి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో రెండో దఫా చర్చలు సోమవారం పాకిస్థాన్‌లో జరుగుతాయని మొదటి నుంచి చెబుతున్నారు.

అమెరికా ప్రతినిధులు ఇప్పటికే ఇస్లామాబాద్ వెళ్తున్నారు. సోమవారం సాయంత్రంలోగా అక్కడికి చేరుకుంటారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే సీరియస్‌గా ఉన్నారు. ఈ రెండో దశ చర్చలు సఫలం కాకపోతే దాడులు చేస్తామని తెలిపారు. తాము చాలా న్యాయమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నామని అన్నారు. ఇరాన్‌ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నానని ట్రంప్‌ చెప్పారు. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్‌లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement